కరోనా వేళ.. దేశ వాసులు తరచూ ఏదో ఒక బ్యాడ్ న్యూస్ వినాల్సి వస్తోంది. కుటుంబ సభ్యులు.. సన్నిహితులు.. స్నేహితులు.. బంధువులు..ఇలా ఎవరో ఒకరుపాజిటివ్ బారిన పడినట్లో.. కరోనా తీవ్రతతో మరణించినట్లో వారి నోటి నుంచి వినిపిస్తోంది. మొదటి వేవ్ తో పోలిస్తే.. సెకండ్ వేవ్ సీరియస్ గా మారటమే కాదు.. పెద్ద ఎత్తున కేసుల్ని.. మరణాల్ని నమోదయ్యేలా చేస్తోంది. దీంతో.. దేశ వాతావరణమంతా ఒకలాంటి ఉద్విగ్నత చోటు చేసుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో గడిచిన కొద్దిరోజులుగా నడుస్తున్న ఐపీఎల్ సీజన్ అర్దాంతరంగా నిలిచిపోనుందా? అన్నది ప్రశ్నగా మారింది.
షెడ్యూల్ ప్రకారం తాజా ఐపీఎల్ మరో నెల రోజుల పాటు జరగనుంది. ఆటగాళ్లతో పాటు.. దీని కోసం పని చేస్తున్న వారంతా ప్రత్యేక బయోబబుల్ లో పలుజాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే.. పలువురు ఆటగాళ్లు.. అంపైర్లు తమ వ్యక్తిగత కారణాలతో టోర్నీ నుంచి తప్పుకోవటంతో ఈ సీజన్ భవితవ్యంపై కొత్త సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఇప్పటికే ఐపీఎల్ నుంచి ఆసీస్ ఆటగాళ్లు కేర్ రిచర్డ్ సన్.. ఆండ్రూ టై.. ఆడం జంపా లాంటి ఆటగాళ్లు కరోనా కారణంగా వైదొలిగితే.. ఆసీప్ అంపైర్ పాల్ రీఫెల్ కూడా టోర్నీ నుంచి వెళ్లిపోతున్నట్లు ప్రకటించారు. భారత్ నుంచి ఆస్ట్రేలియాకు వెళ్లే విమనాల్ని నిలిపివేయటంతో పాటు.. పద్నాలుగు రోజులు భారత్ లో ఉండి ఆస్ట్రేలియాకు వచ్చే విదేశీయులు కానీ.. తమ దేశీయులకు కానీ ఐదేళ్ల వరకు జైలుశిక్షతో పాటు భారీ జరిమానా విధిస్తున్నట్లుగా ఆ దేశ ప్రధాని నిర్ణయం తీసుకోవటంతో.. పలువురు ఆస్ట్రేలియన్లు తమ దేశానికి వెళ్లిపోతున్నారు.
భారత్ నుంచి దుబాయ్ వెళ్లి అక్కడి నుంచి ఆస్ట్రేలియాకు వెళ్లాలన్న ప్లాన్ తో ఉన్నారు. ఈ క్రమంలో పలువురు ఆసీస్ ఆటగాళ్లు వెళ్లిపోతారని చెబుతున్నారు. విదేశీ ఆటగాళ్ల సంగతి ఇలా ఉంటే.. స్వదేశీ ఆటగాళ్ల పరిస్థితి కూడా ఏ మాత్రం బాగోలేదు. ఇప్పటికే టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ టోర్నీకి బై చెప్పేశారు. వారింట్లో ఏకంగా పది మంది కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్ గా తేలటంతో.. వారికి దన్నుగా నిలవటానికి టోర్నీ నుంచి వైదొలుగుతున్నట్లుగా వెల్లడించారు.
అయితే.. ఎంఎస్ ధోనీ తల్లిదండ్రులు కరోనా బారిన పడినప్పటికి ఆయన మాత్రం టోర్నీలో కొనసాగారు. తాజాగా తమ తల్లిదండ్రులు కరోనా నుంచి కోలుకున్నట్లుగా ప్రకటించారు. ఇలా.. ఒక్కొక్కరు ఒక్కోకారణంతో టోర్నీ నుంచి వైదొలిగే ప్లాన్ చేయటంతో.. ఐపీఎల్ టోర్నీ కొనసాగుతుందా? అన్నది సందేహం మారింది. ఈ సందర్భంగా కొందరు ఆటగాళ్లు ఐపీఎల్ పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఐపీఎల్ కొనసాగుతుందన్న మాటను కొందరు చెబుతున్న వేళ.. ఆసీస్ మాజీ కెప్టెన్ ఆడమ్ గిల్ క్రిస్ట్ లాంటి మాజీ ఆటగాళ్లు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఐపీఎల్ అవసరమా? అసలు ఈ టోర్నీ ఉద్దేశం వినోదం కోసమా? పరిస్థితుల్ని ప్రజల నుంచి పక్కకు మళ్లించటమా? అని ప్రశ్నిస్తున్న వైనం సంచలనంగా మారింది.
ఇదిలా ఉంటే.. సగటు జీవి మాత్రం.. ఐపీఎల్ కొనసాగాలని చెబుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లోటీవీలో వార్తల కోసం పెడితే చాలు.. కరోనా వార్తలు.. టెన్షన్ పుట్టే పరిస్థితుల గురంచి తప్పించి మరెలాంటి వార్తలు ఉండటం లేదని.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఐపీఎల్ కాస్త ఆటవిడుపుగా మారి.. దారుణ పరిస్థితుల నుంచి కాస్త రిలీఫ్ ను ఇస్తుందన్న మాట వారి నోటి నుంచి వినిపిస్తోంది. కేసుల తీవ్రత అంతకంతకూ ఎక్కువ అవుతున్న వేళ.. ఐపీఎల్ టోర్నీ చివరి వరకు సాగుతుందా? లేదా? అన్న సందేహంపై ఎవరూ స్పష్టత ఇవ్వలేకపోతున్నారని చెప్పక తప్పదు.