అధికారంలో ఉన్నా లేకున్నా అధిపత్య పోరు రాజకీయాల్లో మామూలే. విపక్షాలతో పోలిస్తే అధికారపక్షంలో మరింత ఎక్కువగా ఉంది. ఇందుకు తెలంగాణ అధికారపక్షం మినహాయింపు కాదు. ఖమ్మం జిల్లాలో ఎంపీ.. మంత్రి అంటూ రెండు వర్గాలుగా చీలిపోయి రాజకీయాలు నడిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇరు వర్గాల మధ్య రాజీకి మంత్రి కేటీఆర్ ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఇరు వర్గాల వారు ఒకరికి మించి మరొకరు పోటాపోటీగా కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నారు.
మంత్రి పువ్వాడ ఒక టీంగా ఎంపీ నామా మరో వర్గం చీలిపోవటం.. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు ఈ గ్రూపుల్లో భాగస్వామ్యం అవుతున్నారు. ఇలాంటి వేళలో జరిగే కొన్ని పరిణామాలు ఈ దూరాన్ని మరింత పెంచేస్తున్నాయి. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్ లో మత్య్సశాఖ ఆధ్వర్యంలో చేపపిల్లల విడుదల కార్యక్రమం జరిగింది.
షెడ్యూల్ ప్రకారం ఉదయం 10 గంటలకు మొదలు కావాల్సిన ఈ కార్యక్రమానికి పదిన్నర ప్రాంతంలో హైదరాబాద్ నుంచి ఎంపీ నామా నాగేశ్వరరావు.. ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ వచ్చారు. అప్పటికి స్థానిక ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి రాలేదు. దీంతో.. ఎమ్మెల్యే ఎక్కడి వరకు వచ్చారని అధికారుల్ని ఆరా తీశారు. వారు ఫోన్ లో కనుక్కోగా.. మార్గమధ్యలో ఉన్నారని పేర్కొనటంతో.. టైంకు రాకపోతే ఎలా అంటూ అసహనాన్ని ప్రదర్శించారు.
అదే సమయంలో.. అక్కడే ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో మంత్రి పువ్వాడ అజయ్.. ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి.. జిల్లా కలెక్టర్ గౌతమ్ ఫోటోలు మాత్రమే ఉండటాన్ని గుర్తించారు. దీనిపై ఎమ్మెల్సీ తాతా మధు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు అధికారుల మాదిరే ఉండాలని.. పనికిమాలిన పనులు చేయొద్దన్నారు.
గవర్నమెంట్ అధికారిగా ఉన్నారు కాబట్టి.. ఎవరికి ఊడిగం చేయొద్దన్న ఆయన.. అందరికి ఫ్లెక్సీలు ఎందుకు పెట్టలేదు? మంత్రి.. ఎమ్మెల్యేల ఫ్లెక్సీలే ఎందుకు పెట్టారు? అలా చేయమని ప్రభుత్వం మీకు చెప్పిందా? మీ డైరెక్టర్ తో మాట్లాడతానంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడి నుంచి కోపంతో వెళ్లిపోయారు.
ఎంపీ నామా.. ఎమ్మెల్సీ తాతా వెళ్లిపోయిన కాసేపటికే వచ్చిన ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి రిజర్వాయర్ లో చేప పిల్లలను విడుదల చేశారు. ఫ్లెక్సీల వివాదం గురించి స్పందించిన ఎమ్మెల్యే.. అధికారుల్ని మందలించారు. ప్రోటోకాల్ పాటించకపోతే ఎలా? అంటూ ప్రశ్నించారు. అసలు ట్విస్టు కార్యక్రమం ముగిసిన తర్వాత చోటు చేసుకుంది. ఫ్లెక్సీల రచ్చ నేపథ్యంలో ప్రోగ్రాం అయిపోయిన తర్వాత ఆగమేఘాల మీద ఎంపీ.. ఎమ్మెల్సీ.. స్థానిక ప్రజాప్రతినిధులతో కూడిన ఫ్లెక్సీని అధికారులు ఏర్పాటు చేశారు. చేతులు కాలాక ఆకులు పట్టుకోవటం అంటే ఇదేనేమో? ఏమైనా.. ఈ ఉదంతం జిల్లాలోని గులాబీ నేతల మధ్య దూరాన్ని మరింత పెంచినట్లైవుతుందన్న మాట వినిపిస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.