అనుకూల మీడియా గట్టిగానే డ్యామేజ్ కంట్రోల్ చేస్తున్నా తెలుగుదేశం పార్టీ సంక్షోభాన్ని ఎదుర్కొంటూ ఉంది. ఇటీవలి ఎన్నికల్లో ఆ పార్టీ ఎదుర్కొన్నది అలాంటిలాంటి ఓటమి కాదు. తన చరిత్రలో ఎన్నడూ ఎదుర్కొనటువంటి దారుణ పరాజయాన్ని ఎదుర్కొంది టీడీపీ.
స్వయంగా చంద్రబాబు నాయుడి తనయుడే ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే అదే లోకేషే తెలుగుదేశం పార్టీకి భవిష్యత్ నాయకుడు అనే ప్రచారం జరుగుతూ ఉంది. బహుశా లోకేష్ ని త్వరలోనే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా చంద్రబాబు నాయుడు నియమించవచ్చు అని ప్రచారం జరుగుతూ ఉంది.
అయితే తెలుగుదేశం పార్టీ అంత వరకూఅయినా కుదుపులు లేకుండా ఉంటుందా? అనేది చర్చనీయాంశంగా మారింది. తెలుగుదేశం పార్టీ త్వరలోనే చీలిపోయే అవకాశం ఉందనే టాక్ కూడా నడుస్తూ ఉండటం గమనార్హం.
ఇప్పటికే తెలుగుదేశం పార్టీలోని కొంతమంది ఎమ్మెల్యేలు అచేతనంగా ఉన్నారు. పార్టీలో ఉన్నా లేనట్టుగా ఉన్నారు. అసెంబ్లీలో కొందరు నోరే విప్పడం లేదు. ఇలాంటి నేపథ్యంలో అలాంటి వారు తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చే ఆలోచనతో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతూ ఉంది.
ఈ మేరకు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అందుకు సంబంధించిన మంత్రాంగం జరుగుతూ ఉందనే టాక్ కూడా వినిపిస్తోంది. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చిచ్చు కూడా తెలుగుదేశం పార్టీలో గట్టిగానే రేగిందని టాక్. ఆ పదవిని పయ్యావుల కేశవ్ కు కేటాయించడంపై తెలుగుదేశం పార్టీలో కొంతమంది అసహనంతో ఉన్నారట. సీనియర్లు అయిన బుచ్చయ్య చౌదరి, కరణం బలరాంలు కూడా అలాంటి అసహనంతో ఉన్నట్టుగా సమాచారం.
ఇలాంటి నేపథ్యంలో గంటా ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర టీడీపీలో ఎమ్మెల్యేలు ఇప్పటికే బీజేపీతో చర్చలు ప్రారంభించారని కొంతమంది ఎమ్మెల్యేలతో కలిసి ఒకే సారి చీలి బీజేపీలోకి విలీనం అనే ఆలోచనతో వారున్నారని ప్రచారం జరుగుతూ ఉంది. రాజకీయ వర్గాల్లో కూడా ఈ అంశం మీద చర్చ జరుగుతూ ఉండటం గమనార్హం.