తెలంగాణలో త్వరలో జరిగే ఉప ఎన్నిక కారణంగా రాజకీయాలు వేడెక్కాయి. ఈ ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో అన్ని ప్రధాన పార్టీల్లో కదలిక వచ్చింది. మాజీ మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ బీజేపీలో చేరడంతో టీఆర్ఎస్ ఆయనను ఓడించేందుకు శాయశక్తుగా శ్రమిస్తోంది. పాత ప్రభుత్వ పథకాల నిధులు విడుదల చేస్తూ.. కొత్త పథకాలను ప్రవేశపెడుతూ ఆకట్టుకుంటోంది. అటు ఈటల రాజేందర్ సైతం మరోసారి ఇక్కడ గెలిచేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నాడు. పాదయాత్ర చేస్తూ ఊరూరా తిరుగుతున్నాడు. ఇక ఈనెల 24 నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజ్ కుడా ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో పాదయాత్ర చేయడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే కిషన్ రెడ్డి వరంగల్ జిల్లాలో పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ఇలా బీజేపీ నాయకులు చేస్తున్న పాదయాత్రలతో ప్రజలు ఏ మేరకు ఆదరిస్తారు..?
2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే ఒక్క ఎమ్మెల్యే సీటు గెల్చుకోవడంతో తెలంగాణలో బీజేపీ ప్రాబల్యం లేనట్లేనని అర్థమయింది. అయితే మూడు ఎంపీ స్థానాలు గెలుచుకోవడంతో పాటు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడంతో ఆ పార్టీకి కాస్త బలం చేకూరినట్లయింది. దీంతో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ బీజేపీ పగ్గాలు అప్పజెప్పింది కమలం అధిష్టానం. దీంతో ఆయన ఆధ్వర్యంలో జరిగిన దుబ్బాక ఉప ఎన్నికలో కాషాయం జెండా ఎగిరింది. తీవ్ర పోటీమధ్య దక్కించుకున్న ఈ నియోజకవర్గాన్ని బీజేపీ దక్కించుకోవడంతో కమలం శ్రేణుల్లో జోష్ నింపినట్లయింది.
ఇదే జోష్ తో జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ కమలం అనుకున్న వాటికంటే ఎక్కువ సీట్లను గెలుచుకుంది. దీంతో ఇక టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీ అని ప్రచారం జరిగింది. కానీ ఆ తరువాత జరిగిన ఎమ్మెల్సీ, నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో మాత్రం బీజేపీ కనిపించలేదు. కనీసం రెండో స్థానంలోనూ నిలవలేదు. ఇదే తరుణంలో హుజూరాబాద్ ఉప ఎన్నిక అనివార్యమైంది. అందులోనూ మాజీ మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ బీజేపీలోకి చేరడంతో ఇప్పుడు ఆయన గెలుపు ప్రతిష్టాత్మకమైంది. ఈటల రాజేందర్ పార్టీ కోసం కాకపోయినా వ్యక్తిగతంగా గెలవాలని తీవ్రంగా కష్టపడుతున్నాడు.
ఈ సమయంలో ఇక్కడి పార్టీ గెలిస్తే వచ్చే ఎన్నికల్లో ప్రభావం ఉంటుందని రాష్ట్ర పార్టీ నాయకత్వం ఆలోచిస్తోంది. దీంతో ఇక్కడ కచ్చితంగా గెలవాలని పార్టీ శ్రేణులు తీవ్రంగా శ్రమిస్తున్నాు. ఇందులో భాంగా పాదయాత్రల పేరుతో ప్రజల్లోకి వెళుతున్నారు. ఇప్పటికే ఈటల రాజేందర్ చాలా గ్రామాల్లో పాదయాత్ర చేశారు. మరికొన్ని గ్రామాల్లోనూ చేయనున్నారు. మరోవైపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా వరంగల్ జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు. ఇక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ఈనెల 24 నుంచి పాదయాత్ర చేసేందుకు రెడీ అవుతున్నారు.
హైదరాబాద్లోని చార్మినాగ్ భాగ్యలక్ష్మి ఆలయం నుంచి హుజూరాబాద్ వరకు ఈ పాదయాత్ర కొనసాగనుంది. ఇప్పటికే టీఆర్ఎస్ పై వ్యతిరేకత వస్తుండడంతో పాటు ప్రభుత్వం లోపాలను ఎత్తి చూపేందుకు ఈ పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. అయితే ఈ పాదయాత్రలు ఎంత వరకు ప్రభావం చూపుతాయన్నది ప్రశ్నార్థంగా మారుతోంది.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఇప్పటికే వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. మరోవైపు మోడీ గ్రాఫ్ తగ్గిందన్న వార్తలు వచ్చాయి. అంతేకాకుండా పెట్రోల్, డీజీల్ రేట్లు పెరుగుదలపై సామాన్యులు కమలం పార్టీపై ఆగ్రహంతో ఉన్నారు. ఈ విషయం బయటపెట్టకుండా టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఏ రేంజ్లో విమర్శలు చేస్తారోనన్న ఆసక్తి మొదలైంది. వ్యవసాయ చట్టాలు, పెగాసస్ వ్యవహారంపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో బండిసంజ్ పాదయాత్ర సక్సెస్ అవుతుందా..? అన్న చర్చ సాగుతోంది.