గ్రహాంతరవాసులు ఉన్నారా? లేదా అనేది ఇప్పటికీ మిస్టరీయే. పలు దేశాల్లో ఎగిరే పళ్లాల్లో (ఫ్లయింగ్ సాసర్స్) లో వింత జీవులను చూశామని ప్రజలు చెప్పినట్టు పలు పాశ్చాత్య దేశాల్లో ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఏలియన్స్‌పైన అవతార్ లాంటి సినిమాలు కూడా సూపర్ డూపర్ హిట్లుగా నిలిచాయి. ఇప్పటికే ఏలియన్స్ ఉనికిని తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ఎప్పటి నుంచో ప్రయత్నాలు సాగిస్తూ వస్తున్నారు. అయితే అధికారికంగా ఏలియన్స్ ఉన్నట్టు నిర్ధారణ కాలేదు. అయితే ఈ సువిశాల విశ్వంలో ఏదో ఒక గ్రహం మీద.. లేదా మరేదైన చోట ఏలియన్స్ (గ్రహాంతర జీవులు) ఉండే అవకాశమైతే ఉందనే అందరూ నమ్ముతున్నారు.
ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తలు తమ ప్రయత్నాలను కొనసాగిస్తూ వస్తున్నారు. ఏలియన్లు ఉంటే అవి మనల్ని గుర్తించేందుకు భారీ టెలిస్కోపులు ఏర్పాటు చేయడం, మన ఆచూకీని తెలపడానికి శక్తిమంతమైన సుదూరం వెళ్లగలిగే వివిధ తరంగాలతో సిగ్నల్స్‌ను పంపుతూ వస్తున్నారు. అయితే ఇలా చేయడం ప్రమాదకరమని.. ఏలియన్స్ మనుషుల కంటే తెలివైనవారయితే అవి మనపైన దాడికి దిగే ప్రమాదం ఉందని.. మానవ జాతిని సమూలంగా నిర్మూలించే ప్రమాదం కూడా ఉందని మరికొందరు శాస్త్రవేత్తలు వారిస్తూ వచ్చారు.
అయితే శాస్త్రవేత్తల పని కొత్త విషయాలను కనిపెట్టడం, తమకు తెలియని విషయాలను అన్వేషించడమే కాబట్టి వారు తమ ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే పలు సుదూర అంతరిక్ష ప్రయోగాల్లో ప్రత్యేకమైన బంగారు డిస్క్‌లను అంతరిక్షంలోకి పంపారు.
ఈ సువిశాల విశ్వంలో ఒకవేళ ఎక్కడైనా గ్రహాంతర జీవులు ఉండి ఉంటాయనే అంతా నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో ఏలియన్స్‌కు భూమి మీద మనం ఉన్నట్టు తెలిపేందుకు శాస్త్రవేత్తలు రాకెట్‌ల్లో ప్రత్యేకమైన బంగారు డిస్క్‌లను అంతరిక్షంలోకి పంపారు. ఆ బంగారు డిస్కులపై మానవులు సాధించిన అభివృద్ధి, వివిధ సాంస్కృతిక, సాంకేతిక అంశాలను వివరించేలా ఉన్న డిజైన్లు, ఆకారాలను పొందుపరిచారు. అయితే ఇవి పూర్తిస్థాయి బంగారు డిస్కులు కాదని చెబుతున్నారు. పన్నెండు అంగుళాల వ్యాసం ఉన్న రాగి ప్లేట్లపై మందంగా బంగారం పూత పూశారని అంటున్నారు.
అంతరిక్షంలో సుదూర ప్రయోగాల కోసం పంపిన వ్యోమ నౌకలలో నాసా శాస్త్రవేత్తలు ఇప్పటికే బంగారు డిస్కులను అమర్చారు. ఇప్పటికే పయోనీర్–10, పయోనీర్–11, వోయేజర్–1, వోయేజర్–2 వ్యోమనౌకలు అంతరిక్షంలోకి చేరుకున్నాయి.
కాగా 1977లో వోయేజర్ వ్యోమనౌకలలో పంపిన బంగారు డిస్క్‌లను గ్రామ్‌ఫోన్ రికార్డుల మాదిరిగా తయారుచేసి నిక్షిప్తం చేశారు. వాటిలో గణితం, సైన్స్‌కు సంబంధించిన వివరాలను, వివిధ ధ్వనులను నమోదు చేశారు. గణితం, సైన్స్, గణిత సూత్రాలను, ఆ చిహ్నాలను గ్రహాంతర వాసులు కూడా అర్థం చేసుకోగలరని శాస్త్రవేత్తల భావిస్తున్నారు. మానవులు, భూమికి సంబంధించి అనలాగ్ పద్ధతిలో ఎన్‌కోడ్ చేసిన 115 చిత్రాలను వ్యోమ నౌకల్లో ఏలియన్స్ కోసం పంపారు. ఈ అనలాగ్ చిత్రాల్లో.. తింటూ, తాగుతూ ఉన్న మనుషులు, తాజ్‌మహల్ వంటి ప్రముఖ స్థలాలు, క్రీడాకారులు, గర్భిణులు, పాలిస్తున్న తల్లి, ఎల్రక్టానిక్ పరికరాలు, న్యూటన్ రాసిన బుక్‌లోని ఓ పేజీ.. ఇలా ఎన్నో ఉన్నాయని అంటున్నారు.
అలాగే 55 భాషల్లో పలకరింపులు, ప్రముఖ సంగీత విద్వాంసుల సంగీతం, వివిధ రకాల ధ్వనులు, భూమిని గుర్తించే మ్యాప్ తదితరాలను కూడా నిక్షిప్తం చేసి వ్యోమ నౌకలలో ఏలియన్స్ మనల్ని గుర్తు పట్టడానికి వీలుగా పంపారు. మరి ఇప్పటికైనా ఏలియన్స్ మన సంకేతాలను అందుకుంటారో, లేదో వేచిచూడాల్సిందే!
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.