తెలంగాణలో ప్రభుత్వ పగ్గాలు త్వరలోనే తారక రాముడి చేతుల్లోకి వెళ్లేలా రాష్ట్రంలో పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఎప్పుడూ లేనట్టుగా దాదాపు 52 మంది ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. వీరి బదిలీలు కేటీఆర్ అభిప్రాయానికి అనుగుణంగా జరిగాయని తెలుస్తోంది. ఎన్నికలు ముగియడం.. పాలనపై ఫోకస్ పెట్టే ఉద్దేశంతో ఈ బదిలీలు జరిగాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నా.. త్వరలో కేటీఆర్ సీఎంగా బాధ్యతలు చేపట్టనుండడంతో ఆయనకు తగ్గట్టు పాలక వర్గం ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికల అనంతరం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు అనుగుణంగా ప్రస్తుతం రాష్ట్రంలో పరిణామాలు మారుతున్నాయి. ఐఏఎస్ ల బదిలీలు, పార్టీలో బాధ్యతలు తదితర వాటితో కేటీఆర్ కు ఎదురులేకుండా కేసీఆర్ చేస్తున్నారు.
ఏ నేను జాతీయ రాజకీయాల్లోకి వెళ్లకూడదా.. ప్రధాని కాకూడదా అని ముందస్తు అసెంబ్లీ ఎన్నికలు - తాజాగా మున్సిపల్ ఎన్నికల అనంతరం కేసీఆర్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. సీఏఏ అంశంపై జాతీయ పోరాటానికి తాను సిద్ధమవుతానని, దాని ద్వారా జాతీయ రాజకీయాల్లోకి వెళ్తానని ప్రకటించారు. ఆ మేరకు కార్యాచరణ సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. అందులో భాగంగా రాష్ట్ర పాలనను తనయుడు కె.తారక రాముడు (కేటీఆర్)కు ఇచ్చి వెళ్లేలా కేసీఆర్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నాడు. కేటీఆర్ కు వ్యతిరేకంగా ఎవరూ నోరు మెదపకుండా - అతడి మాటను జవదాటకుండా పార్టీ శ్రేణులతో - అధికార యంత్రాంగానికి కేసీఆర్ ఆదేశాలు జారీ చేస్తున్నట్లు తెలుస్తోంది.
అందులో భాగంగానే కేరళకు చెందిన పోలీస్ ఉన్నతాధికారి లక్ష్మణ్ నాయక్ కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఐటీ శాఖకు మంత్రిగా అవుతారని ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. అందులో భాగంగా లక్ష్మణ్ నాయక్ కేరళ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారని, త్వరలోనే విధుల నుంచి రిలీవ్ అయ్యి తెలంగాణకు వచ్చే అవకాశం ఉందని కేరళలోని ప్రముఖ పత్రికలు వార్తలు ప్రచురించాయి. దానికి అనుగుణంగా రాష్ట్రంలో కూడా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కేసీఆర్ కేరళ పర్యటనకు వెళ్లిన సమయంలో లక్ష్మణ్ నాయక్ అన్ని తానై వ్యవహారాలు చూసుకున్నారని - దగ్గరుండి పర్యటనను దిగ్విజయంగా చేయడంతో కేసీఆర్ అతడిని రాష్ట్రానికి తీసుకురావాలని భావించారు. దీంతో పాటు త్వరలోనే తెలంగాణ మంత్రివర్గంలో మార్పులు జరిగే అవకాశం ఉంది. ముందే హెచ్చరించినట్టు కేసీఆర్ మున్సిపల్ ఎన్నికల్లో ప్రభావం చూపని మంత్రులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఆ ఫలితాల మాదిరిగా చూసుకుంటే ఉమ్మడి మహబూబ్ నగర్ - నల్గొండ - రంగారెడ్డి జిల్లా నుంచి ఉన్న మంత్రుల పోస్టులు ఊడే అవకాశం ఉంది. మరీ తెలంగాణలో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయో త్వరలోనే తెలిసే అవకాశం ఉంది.