గత టీడీపీ ప్రభుత్వం.. పూర్తి మెజారిటీతో గద్దెనెక్కినా వైసీపీ కి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను లాగేసి ప్రతిపక్షాన్ని దెబ్బతీసింది. కానీ జగన్ ఈసారి అఖండ మెజార్టీ సాధించినా ఆ జోలికి పోలేదు. టీడీపీ దుకాణం ఖాళీ చేసేంత సామర్థ్యం ఉన్నా.. బాబుకు, తనకు తేడా ఇదేనంటూ ఫిరాయింపులను ప్రోత్సహించకుండా ఆదర్శంగా నిలిచారు.
జగన్ ఇప్పటికీ అన్న మాట మీదే నిలబడుతున్నారు. అందుకే వైసీపీలోకి వద్దామని ఉబలాటపడుతున్న టీడీపీ ఎమ్మెల్యేలు ఇప్పుడు రాజీనామా చేసి వస్తేనే తీసుకుంటామని జగన్ ప్రకటించారు. మొన్ననే ఎన్నికల వేళ కోట్లు ఖర్చు పెట్టుకొని గద్దెనెక్కిన ఎమ్మెల్యేలు వైసీపీలోకి రావడానికి రాజీనామా చేసేంత ధైర్యం లేక చాలా మంది బీజేపీ వైపు చూస్తున్నారు.
అయితే తాజాగా వైసీపీలోకి చేరుదామని పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు డిసైడ్ అయ్యారట.. అయితే రాజీనామా చేసి రావాలన్న జగన్ సదాశయానికి వీరు సై అన్నారని తెలిసింది. అందుకే ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు ఇప్పుటు టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరి మళ్లీ ఎమ్మెల్యేలుగా పోటీచేయలాని డిసైడ్ అయ్యారని వార్తలు వస్తున్నాయి.. ఇప్పుడు టీడీపీని వీడుతున్న ఆ ఎమ్మెల్యేల విషయం టీడీపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. గుంటూరు జిల్లా నుంచి ఒకరు.. కృష్ణా జిల్లా నుంచి ఒకరు, ప్రకాశం జిల్లా నుంచి మరో టీడీపీ ఎమ్మెల్యే వైసీపీలోకి రావడానికి రంగం సిద్ధం చేసుకున్నారట.. ఇందులో మంత్రి కొడాలి నానికి సన్నిహితుడైన టీడీపీ ఎమ్మెల్యే కూడా ఉన్నారని వార్తలు వెలువడుతున్నాయి. జగన్ కూడా ఈ మేరకు ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేల రాకకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట.. వారు రాజీనామా చేసి వస్తే గెలిపించుకుంటానని అభయం ఇచ్చాడట.. ఇలా జగన్ ఇచ్చిన హామీతో వారు రాజీనామాకు సిద్ధపడి పార్టీ మారుతుండడం హాట్ టాపిక్ గా మారింది.