అవ‌కాశం ఇస్తారా? వ‌చ్చేస్తాను.. ప‌క్క చూపులు చూస్తున్న మాజీ మంత్రి..!

Update: 2022-11-25 08:30 GMT
రాజ‌కీయాలు ఎప్పుడు ఎలా యూట‌ర్న్ తీసుకుంటాయో చెప్ప‌లేం క‌దా! ఇప్పుడు వైసీపీలోనూ  ఒక కీల‌క నాయ‌కురాలు.. మాజీ మంత్రి..ప‌క్క చూపులు చూస్తున్నార‌నే చ‌ర్చ జోరుగా సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. పార్టీలో ప్రాధాన్యం తగ్గిపోవ‌డం,  నియోజ‌క‌వ‌ర్గంలో అభివృద్ది క‌నిపించ‌క‌పోవ‌డం.. వంటి ప‌రిణామాల నేప‌థ్యంలో ఆమె సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకునేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని గుంటూరులోటాక్ వినిపిస్తోంది.

గుంటూరు జిల్లాలోని ఒక  కీల‌క ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం నుంచివిజ‌యం ద‌క్కించుకున్న ఆమె.. జ‌గ‌న్  కుటుం బానికి ఎంతో ముఖ్య‌మైన నాయ‌కురాలు. ఈ క్ర‌మంలోనే తొలి కేబినెట్‌లోనేమంత్రి ప‌ద‌వి ద‌క్కించుకున్నా రు. అయితే, మ‌లి కేబినెట్‌లోమాత్రం అవ‌కాశం కోల్పోయారు. దీంతో కొన్నాళ్లుగా ఆమె అలుగుతూనే ఉన్నారు. పార్టీలో త‌న‌కు ప్రాధాన్యం లేకుండా పోయింద‌ని.. బ‌హిరంగ విమ‌ర్శ‌లే చేస్తున్నారు.

ఇదేస‌మ‌యంలో గుంటూరు జిల్లాపార్టీ ఇంచార్జ్ బాధ్య‌త‌ల నుంచి కూడా ఆమె త‌ప్పుకొన్నారు. అనంత‌రం.. పార్టీలోనూ పెద్ద‌గా యాక్టివ్‌గా క‌నిపించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. పోనీ.. ఇప్ప‌టి వ‌ర‌కు ఆమెను ఓదార్చేందుకు కానీ, ఆమెను బుజ్జ‌గించేందుకు కానీ, పార్టీ అధిష్టానం ప్ర‌య‌త్నించ‌క‌పోవ‌డం ఇప్పుడు మ‌రింత‌గా ఆమెను వేధిస్తోంది. ఈ నేప‌థ్యంలోనే  వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి.. ఆమె సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకోబుతున్నా రంటూ.. గుంటూరులో ప్ర‌చారం జ‌రుగుతుండ‌డం గ‌మ‌నార్హం.

అయితే.. నేరుగా ఆమె పార్టీ మారినా.. టీడీపీలోకి వెళ్లే ప‌రిస్థితి లేద‌ని తెలుస్తోంది. ఎందుకంటే.. ఇప్ప‌టి వ‌ర‌కు అనేక వేదిక‌ల‌పై టీడీపీని విమ‌ర్శించారు. ఇవి సుతిమెత్త‌వే అయినా.. ఎందుకో ఆమె టీడీపీలోకి కాకుండా.. అవ‌కాశం ఇస్తే..జ‌న‌సేన‌లోకి వెళ్లాల‌ని చూస్తున్నార‌ట‌. జ‌న‌సేన‌-టీడీపీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో క‌లిసి పోటీ చేసే అవ‌కాశం ఉంద‌ని అంచ‌నా వేసుకుంటున్నారు.

ఈ నేప‌థ్యంలో స‌ద‌రు మాజీ మంత్రి వ‌ర్యులు.. ఇదే జ‌రిగితే.. తాను జ‌న‌సేన త‌ర‌ఫున బ‌రిలో నిలిచినా.. టీడీపీ మ‌ద్ద‌తు మాత్రం త‌న‌కే ఉంటుంద‌ని లెక్కలు క‌డుతున్నారు. ఏదేమైనా.. జ‌న‌సేన నుంచి పిలుపు వ‌స్తే.. చాలు.. రెక్క‌లు క‌ట్టుకుని వాలిపోదాం.. అనే రేంజ్‌లో ఆమె ప‌రిస్థితి ఉండ‌డం విశేషం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News