కరోనా వేళ అప్పులు తీర్చేస్తా.. కేంద్రానికి మాల్యా ఆఫర్

Update: 2020-04-01 21:30 GMT
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు తాజాగా కింగ్ ఫిషర్ అధినేత.. బ్యాంకులను ముంచి విదేశాలకు వెళ్లిన మాల్యా  ఓ బంపర్ ఆఫర్ ఇచ్చారు. కరోనాతో లాక్ డౌన్ వేళ కానకష్టంగా మారిన దేశ ఆర్థిక పరిస్థితులను గమనించి.. తాను 100శాతం బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను చెల్లించేందుకు సిద్ధమని ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.

ఈ మేరకు మాల్యా దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను ఉద్దేశించి ట్వీట్ చేశారు. ఈ సంక్షోభ సమయంలో తన విజ్ఞప్తిని ఆలకించాలని కోరారు. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ అప్పులు 100శాతం తిరిగిస్తానని.. తన కోరిక మన్నించాలన్నారు.

తాను అప్పులు తీరుస్తానన్న బ్యాంకులు మాత్రం సిద్ధంగా లేవని మాల్యా వాపోయారు. బ్యాంకులు తన ఆస్తుల అటాచ్ మెంట్లను విడుదల చేసేందుకు ఈడీ కూడా సిద్ధంగా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జోక్యం చేసుకోవాలని సూచించారు.

లాక్ డౌన్ వేళ కింగ్ ఫిషర్ సంస్థలో కార్యకలాపాలన్నీ బంద్ చేశామని.. తాము కూడా లాక్ డౌన్ పాటిస్తున్నామని మాల్యా తెలిపారు.
Tags:    

Similar News