సభ్యసమాజం తలదించుకునే ఘటన చోటుచేసుకుంది. మానవత్వం మంటగలిసేలా దారుణం జరిగింది. చత్తీస్ ఘడ్ లో 56 ఏళ్ల మహిళపై అత్యంత దారుణంగా అత్యాచారం జరిపాడు ఓ మృగాడు.ఇనుపరాడ్ తో టార్చర్ చేయడంతోపాటు తలని బండరాయితో కొట్టి హతమార్చాడు. మానసిక వైకల్యం ఉన్న ఆ మహిళను బెదిరించి ఈ ఘటనకు పాల్పడినట్లు జాంజ్ గిర్-చంపా జిల్లా పోలీసులు చెబుతున్నారు.
మహిళ శరీరంపై రోడ్డుపై పడి ఉండడంతో ముందుగా రోడ్డు ప్రమాదంలో మరణించి ఉంటుందని అనుకున్నారు. కానీ పోస్టుమార్టంలో నిజాలు బయటకు వచ్చాయి. విచారణలో భాగంగా సీసీ కెమెరాలను పరిశీలించారు. దాంతో అసలు విషయం తెలిసింది. రోడ్డుపై ఈడ్చుకెళుతూ ఉన్నట్లు అందులో రికార్డ్ అయ్యింది.
కడుపుపై తన్నుతూ.. కాళ్లపై కొడుతూ ఇనుపరాడ్ తో హింసించినట్టు సీసీ టీవీలో రికార్డు అయ్యింది.
బాధితురాలు ప్రతిఘటించడంతో జుట్టు పట్టుకొని సమీపంలో ఉన్న ఫ్లాట్ లోకి తీసుకెళ్లాడు.అత్యాచారం చేసి అనంతరం హత్య చేసినట్టుగా పోలీసులు గుర్తించారు.
'ఘటన జరిగే సమయంలో బాధిత మహిళ అతడిని తోసేస్తూ పోరాడుతూనే ఉంది. కోపంతో విసిరికొడుతున్నా.. కిషన్ ఆమెను కొడుతూ దాడి చేస్తూనే ఉన్నాడు. అలా ప్రాణం తీసేశాడని పోస్టుమార్టంలో తేలింది.హత్య, అత్యాచారం కేసులు నమోదు చేసి నిందితుడిని జైలుకు పంపించారు.
కొన్నేళ్ల క్రితమే పేరెంట్స్ ను కోల్పోయిన మానసిక వైకల్యం ఉన్న మహిళ.. స్థానికులు పెట్టింది తిని కాలం వెళ్లదీశారు. అటువంటి మహిళపై 31 ఏళ్ల వ్యక్తి ఈ హత్యాచారానికి పాల్పడినట్టు తెలిసి అతడిని అరెస్ట్ చేశారు పోలీసులు.31 సంవత్సరాల వయసున్న కిషన్ యాదవ్ ను అరెస్ట్ చేసి విచారించగా నేరాన్ని ఒప్పుకున్నాడు.