న్యూజిలాండ్ తో టెస్ట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు - క్రీడాకారులందరి దృష్టి ఆటపైనే ఉంది - మ్యాచ్ సక్సెస్ ఫుల్ గా ముగియడంతో ఇక మన కుర్రాలందరి మనసు పార్టీ పై ఉండి ఉంటుంది! అయితే మ్యాచ్ జరుగుతున్నంతసేపూ మనసు ఆటపై పెట్టినా... మ్యాచ్ ముగిసిన వెంటనే కూతురు దగ్గరకి పరుగెట్టుకుంటూ వెళ్లిపోయాడు భారత ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ షమి. అవును... న్యూజిలాండ్ తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ సమయంలో షమీ చిన్న కూతురు అనారోగ్యంతో ఐసీయూలో చికిత్స పొందుతూ ఉంది. మైదానంలో కమిట్ మెంట్ ఉన్న ఆటగాడు - మ్యాచ్ ముగిసిన వెంటనే తండ్రిగా మారిపోయాడు - హుటా హుటిన ఆస్పత్రిలో వాలిపోయాడు.
భారత ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ షమీ ఆట పట్ల తనకున్న అంకితా భావాన్ని చాటుకున్నాడు. ఒకవైపు తన చిన్న కూతురు అనారోగ్యంతో ఐసీయూలో చికిత్స పొందుతున్నప్పటికీ.. న్యూజిలాండ్ తో జరిగిన రెండో టెస్టులో ఆడాడు షమీ. అక్టోబర్ 1న రెండో రోజు ఆట ముగిసిన తర్వాత షమీకి తన కూతురు ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసింది. అయితే... మిగిలిన రెండు రోజుల టెస్ట్ మ్యాచ్‌లో బౌలర్లదే కీలక భూమిక కానుండటంతో ఈ సమయంలో మ్యాచ్ విడిచి వెళ్లేందుకు సిద్ధపడలేదు షమీ. అలా పగలంతా మ్యాచ్ ఆడుతూ - సాయంత్రం మ్యాచ్ ముగియగానే ప్రతీ రోజు రాత్రి ఆస్పత్రికి వెళ్లి తన కూతురును చూసి వచ్చేవాడు. తీవ్రమైన జ్వరం - శ్వాస సమస్య కారణంగా షమీ చిన్న కూతురు 14 నెలల వయసున్న ఐరా - ఐసీయూలో చేరింది.
కాగా, రెండో టెస్టులో షమీ మొత్తం 6 వికెట్లు పడగొట్టి మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో మూడు టెస్టుల సిరీస్ 2-0తో టీమిండియా కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ అనంతరం స్పందించిన సమీ తాను తన కూతురిని ఆస్పత్రిలో చూసి వచ్చిన తర్వాత ప్రతీ రోజు రాత్రి కెప్టెన్ తనకుజ్ ఎంతో స్ఫూర్తినిచ్చేవాడని, ఈ విషయంలో కంగారు పడొద్దని - పాప ఆరోగ్యంగా ఆస్పత్రి నుంచి బయటకు వస్తుందని అందుకే కెప్టెన్ కు - ఇతర ఆటగాళ్లకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని తెలిపాడు. ఇదే సమయంలో కూతురు అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నప్పటికీ.. ఎంతో అంకితభావంతో షమీ మ్యాచులో అద్భుత ప్రదర్శన చేశాడని టీవీ కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ షమీపై ప్రశంసలు కురిపించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/