హెల్మెట్ పెట్టుకుని పాఠాలు చెప్తున్న టీచర్లు

Update: 2017-07-21 12:50 GMT
తెలంగాణ రాష్ర్టం మెదక్ జిల్లాలోని ఓ పాఠశాల ఉపాధ్యాయులు తరగతి గదుల్లోనే తలకు హెల్మెట్లు ధరించి పాఠాలు చెప్తున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. టైమ్స్ నౌ చానల్ ఈ దృశ్యాలు ప్రసారం చేయడంతో అక్కడి నుంచి అవి సోషల్ మీడియాకు చేరి దేశవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. ఇంతకీ వారెందుకిలా చేస్తున్నారో తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే.
    
మెదక్ జిల్లా చిన్నశంకరంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు తలకు హెల్మెట్లు పెట్టుకుని పాఠాలు చెప్తున్నారు. తరగతి గదుల్లోని సీలింగ్ ఇటీవల కురిసిన వర్షాలకి తడిసి పెచ్చులు ఊడి పడుతున్నాయి దీంతో... అవి తలపై పడితే గాయపడే ప్రమాదం ఉండడతో వారు పై అధికారులు ఎన్నోసార్లు ఈ దుస్థితిని వివరించారు. కానీ.. పట్టించుకునేవారే లేరు. దీంతో వారు నిరసనగా ఈ పని చేశారు.
    
మూడేళ్లుగా అక్కడి ఉపాధ్యాయులు, విద్యార్థులు ప్రతి రోజూ భయంభయంగానే క్లాసు రూముల్లో ఉంటున్నారట. జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి ఈ స‌మ‌స్య‌ తీసుకెళ్లినప్పటికీ లాభం లేకుండాపోతోంద‌ని ఆ పాఠ‌శాల విద్యార్థులు, టీచ‌ర్లు ఆవేదన చెందుతున్నారు. ఎప్పుడెవరు గాయపడతారో తెలియని పరిస్థితుల్లో పిల్లలు ఎలా చదువుకోగలరని వారు ప్రశ్నిస్తున్నారు.
    
ఈ హెల్మెట్ టీచర్ల బాధలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి..

Full View
Tags:    

Similar News