తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగ సీజన్లో ఆర్టీసీ - ప్రయివేటు బస్సులు... రైళ్లు ఎలా కిటకిటలాడుతాయో ఇప్పుడు ప్రపంచ దేశాల్లోని అన్ని విమానాశ్రయాల నుంచి అమెరికా వెళ్లే విమానాలు కిటకిటలాడిపోతున్నాయి. దీంతో విమానయాన సంస్థలు అమెరికాలోని వివిధ నగరాలకు వెళ్లే విమాన టిక్కెట్ల ధరలు అమాంతం పెంచేసి రద్దీని సొమ్ము చేసుకుంటున్నారు. ఇంతకీ.. ఒక్కసారిగా ఇంత డిమాండు పెరిగిపోవడానికి కారణం ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏడు దేశాల నుంచి వచ్చేవారిపై నిషేధం విధించడం.. దానిపై కోర్టు స్టే ఇవ్వడం తెలిసిందే. స్టే ఇవ్వడంతో ఇంతకాలం అమెరికాలో ఉంటూ తమ సొంత దేశాలకు వచ్చినవారంతా వీలైనంత తొందరగా తిరిగి అమెరికా వెళ్లాలని ప్రయత్నిస్తున్నారు. ఏ క్షణమైనా స్టే ఎత్తేయొచ్చని.. అదే జరిగితే తిరిగి అమెరికా వెళ్లడం కుదరకపోవచ్చన్నది వారి భయం.
ముఖ్యంగా సోమవారం అంటే ఈ రోజు తరువాత ఎప్పుడైనా స్టే ఎత్తేయొచ్చని.. ట్రంప్ మళ్లీ ట్రావెల్ బ్యాన్ విధించవచ్చన్న అంచనాలున్నాయి. దీంతో ఎక్కడెక్కడ ఉన్నవారంతా తిరిగి అమెరికాకు ప్రయాణమవుతున్నారు. దీంతో ప్రపంచం నలుమూలల నుంచి అమెరికా వెళ్తున్న ఏ విమానంలోనూ ఒక్క సీటు కూడా ఖాళీ లేదట.
ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చాక విదేశీయులకు చెందిన 60 వేల వీసాలను రద్దు చేశారు. అయితే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై స్టే ఇవ్వడంతో వీసాలు రద్దయినవారంతా హుటాహుటిన తిరిగి అమెరికా వెళ్లిపోతున్నారు.
తాజాగా ట్రంప్ నిర్ణయాన్ని ఫెడరల్ అప్పీళ్ల న్యాయస్థానం తిరస్కరించడంతో ఆయా ముస్లిం మెజారిటీ దేశాల ప్రజలు తిరిగి అమెరికాకు వస్తున్నారు. ఇక తమ రాక అసాధ్యమనుకున్న నేపథ్యంలో వారు తిరిగి అమెరికాకు చేరుకుంటుండడంతో వారు ఆనందబాష్పాలతో విమానం దిగుతున్నారు. తాజాగా పలు ఎయిర్‌పోర్టుల్లో ముస్లిం దేశాల నుంచి వచ్చిన వారు అమెరికాలోని తమ బంధువులు - ఆత్మీయులు - మిత్రులను కలుసుకుని కన్నీటితో ఆలింగనాలు చేసుకున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/