ఒక్క వ్యక్తి కాల్చిన సిగరెట్ వల్ల... 18 మందికి కరోనా సోకిందని ఓ వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది. ఈ ఘటన జరిగింది మన హైదరాబాద్ లోనే కావడం గమనార్హం. శ్రీనగర్ కాలనీలో ఉంటున్న ఓ మార్కెటింగ్ మేనేజర్ కొన్ని రోజుల క్రితం ఆఫీస్ పనిపై బయటకు వెళ్లాడు. వెళ్తూ కేబీఆర్ పార్క్ దగ్గర ఆగాడు. అక్కడ ఉన్న సమయంలో మేనేజర్‌కి ఓ సిగరెట్ తాగాలి అనిపించింది. కానీ మ్యాచ్ బాక్స్ లేదు. ఆ పక్కనే ఓ వ్యక్తి సిగరెట్ తాగుతున్నాడు. ఆయన దగ్గరకు వెళ్లి ఓసారి మీ సిగరెట్ ఇస్తారా, నా సిగరెట్ అంటించుకుంటాన అని అడిగితే అయన తీసుకోండి అని ఇచ్చాడు అతడు. దీనితో తన సిగరెట్ అంటించుకున్న మేనేజర్ , దాన్ని కాల్చుకుంటూ , గుప్పుగుప్పున పొగ వదులూ పనిమీద వెళ్లిపోయాడు.
ఇదిలా ఉంటే .. మూడు రోజుల తర్వాత జ్వరం, ఒంటి నొప్పులు బాగా వచ్చాయి. అడుగుతీసి అడుగు వేయలేయలేకపోయాడు. ఊపిరి ఆడట్లేదు. దీనితో కుటుంబ సభ్యులు సీటీస్కాన్ చేయించారు. కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయ్యింది. అతని ఊపిరితిత్తులు 30 శాతం దెబ్బతిన్నాయని చెప్పారు. మార్కెటింగ్ టీమ్ కు హెడ్ అయిన ఆయన విషయాన్ని తన టీం సభ్యులకు చెప్పాడు. వాళ్లు మొత్తం 20 మంది ఉన్నారు. వాళ్లంతా టెస్టులు చేయించుకుంటే... వాళ్లలో 18 మందికి కరోనా వచ్చినట్లు తేలింది. అందరూ ఐసోలేషన్ అయ్యారు. దీనితో ఆ 18 మంది నుండి ఎంతమందికి వ్యాపించిందో తెలుసుకునే పనిలో నిమగ్నమైయ్యారు. మేనేజర్ వల్లే తమకు కరోనా పాజిటివ్ వచ్చిందని కంపెనీ హెచ్‌ఆర్ ముందు అందరూ చెప్పారట. దీనితో ఆ మేనేజర్ తనకు కరోనా ఎలా సోకింది అనేదానిపై ఆలోచించాడు. వారం నుంచి ఆయన ఎవరెవర్ని కలిశాడో డాక్టర్లకు చెప్పాడు. ఆ క్రమంలో సిగరెట్ వెలిగించుకున్నప్పుడు ఓ వ్యక్తి దగ్గర సిగరెట్ తీసుకొని, వెలిగించుకున్నట్లు చెప్పాడు. అలా అంటింది కరోనా అని డాక్టర్లు చెప్పడంతో షాక్ అయ్యాడు. మొత్తానికి తాను సిగరెట్ తో కరోనా అంటించుకోవడమే కాకుండా పలువురికి అంటించాడని టీం సభ్యులు అనుకుంటున్నారు.