కాలం కలిసి వచ్చినప్పుడు కట్లపాము సైతం కర్రలా కనిపిస్తుంది. అదే టైం బాగోలేనప్పుడు టెంకాయ సైతం టైంబాంబుగా మారుతుందన్న మాటకు తగ్గట్లే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఇప్పుడు టైం సరిగ్గా నడుస్తున్నట్లుగా లేదు. ఓవైపు కొడుకును ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టాలని తెగ ట్రై చేస్తుంటే.. ఎప్పటికప్పుడు ఏదో ఒక అడ్డంగి వచ్చి పడుతోంది. మరోవైపు.. తెలంగాణలో తమకు తిరుగులేదన్న భావన ప్రజల్లో కలిగించే విషయంలో సారు పార్టీ వెనుక పడిపోవటం తెలిసిందే.
దుబ్బాక ఉప ఎన్నికకు ముందు వరకు తెలంగాణలో గులాబీ కారుకు తిరుగులేని పరిస్థితి. కానీ.. ఆ ఉప ఎన్నిక ఫలితంతో లెక్కలు తేడా రావటం.. అదేమీ గాలి వాటంతో వచ్చింది కాదు..జనాల్లో మార్పు వచ్చిందన్న విషయాన్ని గ్రేటర్ ఎన్నికలు చెప్పేశాయి. అప్పటివరకు గ్రేటర్ హైదరాబాద్ లో పెద్ద బలం లేని బీజేపీ.. ఆ ఎన్నికల పుణ్యమా అని.. తెలంగాణ అధికారపక్షమే ఉలిక్కిపడే పరిస్థితి.
ఇదిలా ఉండగా.. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ముంచుకు రావటం.. ఎన్నికల కమిషన్ ప్రకటన చేసినంతనే దాన్ని నిర్వహించే అవకాశం ఉంది. దాని నుంచి బయటపడే మార్గం ఏమిటన్నది ఇప్పుడుప్రశ్న. ఇదిలా ఉంటే.. తాజాగా మరో రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. రాజన్న సిరిసిల్ల వేములవాడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ పౌరసత్వం మీద ఎప్పటి నుంచో వివాదం ఉంది. దీనికి సంబంధించి తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది.
ఆయన పౌరసత్వానికి సంబంధించి హైకోర్టులో జరిగిన విచారణ సందర్భంగా కేంద్ర హోంశాఖ అఫిడవిట్ జారీ చేసిన వైనం ఇప్పుడు రాజకీయ కలకలంగా మారింది. ఎందుకంటే.. ఎమ్మెల్యే చెన్నమనేని పౌరసత్వం జర్మనీదని తేల్చింది. విదేశీ పౌరసత్వం ఉన్న వ్యక్తి పదేళ్లు చట్టసభల్లో ఉండటానని తీవ్రమైన అంశంగా పరిగణించాలని కోర్టును పిటిషన్ దాఖలు చేసిన వారు కోరుతున్నారు. రోస్టర్ మారటంతో సంబంధిత బెంచ్ విచారణ జరుగుతుందని జస్టిస్ చల్లా కోదండరాం వెల్లడించారు. తాజాగా హోంశాఖ అఫిడవిట్ దాఖలు చేయటంతో ఆయన ఎన్నిక చెల్లదని పేర్కొంటూ ఆ ఎన్నికను కొట్టివేయటం ఖాయం. అదే జరిగితే మరో ఉప ఎన్నికకు తెర తీసే పరిస్థితి. అదే జరిగితే.. కేసీఆర్ సారుకు మరో అగ్నిపరీక్ష రెఢీ అయినట్లే.