హనీమూన్ అంటే ఎలా జరుపుకొంటారు? ఎంచక్కా భార్య - భర్త కలిసిపోయి.....అబ్బో ఆ సంబరం అనుభవిస్తే కానీ తెలియదు. కానీ భర్తతోనే హనీమూన్ జరుపుకోవాలని ఏం లేదుగా?! కొత్తగా కూడా హనీమూన్ ను జరుపుకోవచ్చుగా? ఇదేం చిత్రమైన డౌట్ అనుకుంటున్నారా... అలా జరిగిన ఓ ఆసక్తికరమైన హనీమూన్ గురించి తెలుసుకుంటే మీరు తప్పక ఆశ్చర్యపోతారు.
అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన క్విన్ డ్యూన్ - లాన్ డన్ బోరప్ లు వివాహం చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. స్థానికంగా ఉన్న ప్రముఖ సిటిజన్ హోటల్ లో వివాహ వేడుక జరుపుకోవాలని ఆర్డర్ లన్నీ ఇచ్చేశారు. అయితే వివాహం వారం రోజులు ఉందనగా పెళ్లికొడుకు ఉన్నట్లుండి పెళ్ళిని రద్దు చేసుకున్నాడు. అయితే అప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. హాల్ బుకింగ్ - పూల అలంకరణలు - ఆహార పదార్ధాల ఆర్డర్ లు వంటి పలు ఘట్టాలు పూర్తైయ్యాయి. వరుడి స్టేట్ మెంట్ తో పెళ్లికూతురు ఒక్కసారిగా నిశ్చేష్ఠురాలైంది.
అయితే ఆ షాక్ నుంచి చిన్నగా తేరుకుని పరిష్కార మార్గాలు అన్వేషించింది. వేడుక ఏర్పాట్లకు దాదాపు రూ. 23 లక్షలు ఖర్చు కాగా...ఇందులో చాలావరకు డబ్బులు తిరిగి ఇవ్వని కేటగిరికి చెందినవే. దీంతో డబ్బులు తిరిగిరావు కాబట్టి వాటిని సద్వినియోగం చేసే కార్యాచరణకు ఉపక్రమించింది. తన తల్లిని పిలిచి తాను తీసుకోబోయే చర్య గురించి వివరించింది. ఓ స్వచ్ఛంద సంస్థను ఆశ్రయించి తన వివాహ వేడుక ఖర్చును ఏవిధంగా సద్వినియోగం చేయదలచుకుందో తెలిపింది.
ఆ సంస్థ పెళ్లి విందుపై ప్రచారం చేసింది. ఇళ్లులేని వాళ్లు. ఒంటరివాళ్లు - వృద్ధులు - పసిపిల్లలతో కూడిన సమూహాన్ని విందుకు ఆహ్వానించారు. వారంతా ఆనందంగా ఆ భోజనం ఆరగించి తృప్తిగా వెళ్లిపోయారు. అలా సదరు పెళ్లికూతురు అమ్మతో కలిసి హనీమూన్ ను పూర్తిచేసింది. దీనిపై పెళ్లికూతురు తల్లి స్పందిస్తూ.. తన కూతురుకు ఇలా జరగటం ఎంతో బాధ కలిగించిందని అయితే ఇబ్బందికర పరిస్థితుల్లో కూడా గొప్పగా ఆలోచించడం తమ హృదయాలకు హత్తుకుందని కొనియాడింది.
ఒక నష్టాన్ని కూడా సమాజ హితం కోసం ఏ విధంగా ఉపయోగించవచ్చో ఈ ఘటన ప్రపంచానికి చాటిచెప్పిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.