హెల్మెట్ లేకుండా వాహనం పై వెళితే లైసెన్స్ రద్దు.. ఎన్ని రోజులో తెలుసా?

Update: 2022-04-09 00:30 GMT
హెల్మెట్ లేకుండా బైక్ పై వెళ్తున్నారా... రవాణా శాఖ అధికారులు పట్టుకుంటే గతంలో మాదిరిగా డబ్బులు చెల్లించే వెళ్తామంటే ఇప్పుడు కుదరదు. చచ్చినట్లు పోలీసులు చెప్పినట్లు వినాల్సిందే. ఫైన్ డబ్బులు కట్టడంతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ ను మూడు నెలల పాటు రద్దు చేయించుకున్నట్లే.

ఇదీ చాలదన్నట్లు గంటలు గంటలు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో కూర్చొని  ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై అవగాహన కల్పించే వీడియోలను చూపిస్తారు. ఇవన్నిటికంటే హెల్మెట్ పెట్టుకోవడమే బెటర్ అనిపిస్తోంది కదా.. అసలు పోలీసులు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ట్రాఫిక్ ఉల్లంఘనలను అరికట్టేందుకు ముంబై ట్రాఫిక్ పోలీసులు సరికొత్త చర్యలు తీసుకోబోతున్నట్లు తెలిపారు. ఈ మేరకు ముంబైలో శిరస్త్రాణం లేకుండా వాహనంపై వెళ్లే వారికి మూడు నెలల పాటు లైసెన్స్ రద్దు చేస్తామని ప్రకటించారు. అంతే కాకుండా ఈ కొత్త నిబంధనలకు సంబంధించి యూట్యూబ్ లో వీడియోని పోస్ట్ చేశారు.

అయితే ఈ వీడియోలో "హెల్మెట్ లేకుండా ప్రయాణించడం ప్రమాదకరం. హెల్మెట్ లేకుండా ప్రయాణించే ప్రతి వ్యక్తి చలాన్ ని వెంటనే ఆర్టీఓకి పంపుతాం. దీంతో పాటు మూడు నెలల పాటు లైసెన్స్ రద్దు చేస్తాం.  అలాగే జరిమానా కూడా విధిస్తాం. ఆ తర్వాత ఆ వ్యక్తిని సమీపంలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు తరలిస్తాం. అక్కడ ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించే వీడియోలను చూపిస్తాం" అని డీసీపీ రాజ్ తిలక్ రోషన్ పేర్కొన్నారు.

అలాగే ఎరుపు రంగు సిగ్నల్ పడినప్పుడు హారన్ లు మోగించకుండా ట్రాఫిక్ సిగ్నల్ వద్ద డెసిబెల్ మీటర్లను ఏర్పాటు చేశారు. ఎవరైనా హారన్ మోగిస్తే ఆయా వాహనాల వ్యక్తుల డబుల్ టైం వెయిటింగ్ చేయించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకు ప్రధాన కారణం... రెడ్ సిగ్నల్ వద్ద అత్యథికంగా హారన్ లు కొడ్తూ.. వాహనదారులు శబ్ధ కాలుష్యాన్ని సృష్టించడమే. దీన్ని అరికట్టేందుకే ఇలాంటి చర్యలు తీసుకుంటున్నామని జాయింట్ పోలీస్ కమిషనర్ మధుకర్ పాండే తెలిపారు.

మీ ప్రాణాలు కాపాడుకునేందుకు హెల్మెట్ ధరించమని, కారులో వెళ్తే సీటు బెల్టు పెట్టుకోవాలని చెప్పేదని.. దాని వల్ల మాకేం లాభం లేదంటూ ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. కానీ అందం కోసం, జుట్టు పాడవుతుందంటూ.. వేడి అవుతుందని చెప్తూ.. చాలా మంది ప్రాణాలను పణంగా పెట్టి హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలపై ప్రయాణం చేస్తుంటారు. పోలీసులు ఇలాంటి చర్యలు తీసుకోవడం వల్లైనా వాహన దారులు శిరస్త్రాణం ధరిస్తారో లేదో చూడాలి.
Tags:    

Similar News