రీల్ కథలకు తగ్గట్లే కొన్ని ఉదంతాలు రియల్ లైఫ్ లోనూ చోటు చేసుకుంటాయి. తాజాగా అధికారపక్ష ఎమ్మెల్యేకు చెందిన ఉదంతం అచ్చం రీల్ కథను పోలి ఉండటం విశేషం. ఇద్దరు లవ్వర్స్.. అనుకోకుండా అమ్మాయికి బాగా పేరున్న ప్రముఖుడితో పెళ్లి ఫిక్స్ అవుతుంది. పెళ్లి నాటికి పెళ్లి కొడుకు బకరా కావటం.. లవ్వర్ పెళ్లి పీటలు ఎక్కటం ఒక టైపు. మరో టైపులో పెళ్లి కుమార్తె పెళ్లి కొడుకును కాదని వెళ్లిపోవటం. తాజా ఉదంతంలో రెండోది చోటు చేసుకుంది. తమిళనాడులో తీవ్ర సంచలనంగా మారిన ఈ ఉదంతంలోకి వెళితే..
తమిళనాడు ఈరోడ్ జిల్లా భవానీసాగర్ నియోజకవర్గం అన్నాడీఎంకే ఎమ్మెల్యే ఈశ్వరన్ (43)కు.. గోబిశెట్టిపాళయం సమీపంలోని ఉక్కరం ప్రాంతానికి చెందిన సంధ్య (23)తో పెళ్లి నిశ్చయమైంది. ఇటీవలే వీరిద్దరి ఎంగేజ్ మెంట్ ఘనంగా సాగింది.
ఒక.. పెళ్లికి కూడా ముహుర్తం పెట్టేశారు. ఈనెల 12న సత్యమంగళం సమీపంలోని బన్నారి అమ్మన్ ఆలయంలో వీరి పెళ్లి జరగాల్సి ఉంది. ఈ పెళ్లికి రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు.. అధికారపక్షానికి చెందిన పలువురు మంత్రులు.. ఎంపీలు.. ఎమ్మెల్యేలు హాజరు కావాల్సి ఉంది. సీఎం పళనిస్వామి.. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంతో సహా పలువురు మంత్రులు పెళ్లికి వస్తామని మాట ఇచ్చారు. దీంతో.. ఆ విషయాన్ని శుభలేఖల్లో పేర్కొన్నారుకూడా.
పెళ్లి టైం దగ్గరకు రావటంతో పెళ్లి పత్రికలు పంపిణీ చేశారు. పెళ్లి పనులు భారీగా చేస్తు్న్నారు. ఇలాంటి వేళ.. ఊహించని రీతిలో పెళ్లి కుమార్తె మరొక వ్యక్తిగా వెళ్లిపోవటం సంచలనంగా మారింది.
శనివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో పెళ్లి కుమార్తె సంధ్య తన సోదరిని చూసేందుకు వెళుతున్నట్లుగా ఇంట్లో వారికి చెప్పి బయటకు వెళ్లింది.ఎంతకూ ఇంటికి రాకపోవటంతో కుటుంబ సభ్యులు కలవరపడ్డారు. దీంతో.. ఈ విషయం పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు.
రంగంలోకి పోలీసులు దిగి.. సమాచారం సేకరిస్తే.. ఆమె ఊత్తుకుళి ప్రాంతానికి చెందిన విగ్నేష్ అనే కుర్రాడితో లవ్ లో ఉందని.. వారిద్దరి విషయం అమ్మాయి పేరెంట్స్ కూడా తెలుసన్న విషయం బయటకు వచ్చింది.ఈ విషయాన్ని దాచి పెట్టి ఎమ్మెల్యేతో పెళ్లికి ఏర్పాట్లు చేశారు. దీంతో తట్టుకోలేకపోయిన ఆ అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. దీంతో.. పెళ్లికుమార్తె కోసం పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్లో పులుసులో ములక్కాయలా మారిన ఎమ్మెల్యే ను తలుచుకుంటే అయ్యో అనిపించకమానదు.