అమెరికా అధ్యక్షుడి నీడగా ఉండే సంచలనాలు.. ఆయనకు సంబంధం లేని అంశాల్లోనూ ఆయన్ను రచ్చకీడుస్తున్నాయి. ట్రంప్ కారణంగా తన కాపురం కూలిపోయిందని ఒక మహిళ చెబుతోంది. ఈ వ్యవహారం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ట్రంప్ కారణంగా వివాదాలు.. ఆందోళనలు మామూలే కానీ.. ఆయన కారణంగా ఒక పచ్చటి కాపురం కూలిపోయిందన్నది ఇప్పుడు సంచలనంగా మారింది. ఇంతకీ అలాంటి పరిస్థితి ఎందుకు చోటు చేసుకుందో చూస్తే..
అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన డేవ్.. లిన్ లు రెండేళ్ల క్రితం (2015) పెళ్లి చేసుకున్నారు. ఇంతకీ లిన్ ఎవరంటే ఒకప్పటి అమెరికన్ ఫుట్ బాల్ జట్టు మయామి డాల్ఫిన్స్ కు ఛీర్ లీడర్ గా పని చేశారు. ఇక.. ఆమె భర్త డేవ్.. పామ్ బీచ్ కౌంటీకి అటార్నీగా వ్యవమరిస్తున్నారు. మరి.. వీరిద్దరి మధ్యలో ట్రంప్ పంచాయితీ ఏమిటంటారా? అక్కడికే వస్తున్నాం.
లిన్‌కు ట్రంప్ అంటే మహా అభిమానం. ఆయన్ను విపరీతంగా అభిమానించి.. ఆరాధిస్తుంది. ట్రంప్ మీదున్న అభిమానంతో తాను ముద్దుగా పెంచుకునే కుక్కకు ట్రంప్ కుమార్తె.. ఇవాంకా పేరు పెట్టుకొని మురిసిపోయింది. ఏ మాత్రం అవకాశం చిక్కినా అధ్యక్షుల వారితోకలిసి పలుమార్లు సెల్ఫీలు దిగింది.
అదే పనిగా అధ్యక్షుల వారితో సెల్ఫీలు దిగటంపై లిన్ భర్తకు అస్సలు నచ్చలేదు. ఈ వ్యవహారం అంతకంతకూ ముదిరి.. ఈ జంట మధ్య పలు గొడవలకు కారణమైంది. దీంతో.. వీరిద్దరూ విడాకులు తీసుకోవాలని డిసైడ్ అయ్యారు. తాజాగా వీరికి విడాకులు మంజూరు చేస్తూ స్థానిక కోర్టు ఒకటి ఆదేశాలుజారీ చేసింది. తాము విడిపోవటానికి ట్రంప్ కారణంగా చెబుతున్నారు.