రోజూ ఉదయాన్ని కాంటాక్ట్ లెన్సెస్ పెట్టుకోవడం.. రాత్రి పడుకునే ముందు వాటిని తీసివేయాలనే సంగతిని మరిచిపోయింది.. ఓ మహిళ. ఇలా ఏదో ఒక రోజో, రెండు రోజులో కాదు.. వరుసగా 23 రోజులపాటు కాంటాక్ట్ లెన్సెస్‌ను తీసి వేయడం మరిచింది. దీంతో ఆ కాంటాక్ట్ లెన్సులన్నీ ఆమె కంటి కింద ఒక కుప్పలాగా పేరుకుపోయాయి.
దీంతో ఆమె ఆస్పత్రికి వెళ్లగా అమెరికాకు చెందిన వైద్యురాలు కాంటాక్ట్ లెన్సుల కుప్పను కంటి నుంచి తొలగించిన ప్రక్రియను వీడియో తీశారు. దాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేశారు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది.
కాగా ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతాయని డాక్టర్ డాక్టర్ కేథరినా కుర్టీనా చెబుతున్నారు. ఉదయాన్నే కొత్త కాంటాక్ట్ లెన్సెస్ పెట్టుకుని, రాత్రి తొలగించడం బాధిత మహిళ మరిచిపోయేదని తెలిపారు. ఇలా 23 రోజులపాటు ఆమె తన కాంటాక్ట్ లెన్సులను తన కంటి నుంచి తొలగించడం మర్చిపోయిందన్నారు. దీంతో తన ఆస్పత్రిలో23 కాంటాక్ట్ లెన్సులను తొలగించామని చెప్పారు.
‘ఒకరి కంటి నుంచి 23 కాంటాక్ట్ లెన్సులు బయటకు తీశాం. ఇదిగో... రియల్ వీడియో. కాంటాక్ట్ లెన్సులు ఉంచుకుని మాత్రం నిద్రపోవద్దు’’ అని నెటిజన్లకు ఆమె సూచించారు. డాక్టర్ కేథరినా కుర్టీనా పోస్టు చేసిన ఈ వీడియోకి ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా 2.9 మిలియన్లకుపైగా వ్యూస్ వచ్చాయి. అలాగే 81 వేలకు మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియో చూసినవారు ఆ కాంటాక్ట్ లెన్సుల తొలగింపు ప్రక్రియను చూసి షాకవుతున్నారు. కామెంట్స్ రూపంలో తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
కాంటాక్టు లెన్సులు పెట్టుకుని వాటిని తీయడం మరిచిపోయిన మహిళకు కళ్లద్దాలు ఇవ్వాలని ఒక నెటిజన్ సూచించాడు. ఇకపై కాంటాక్ట్ లెన్సెస్ వాడొద్దంటూ ఓ యూజర్ సూచించాడు. బాధిత మహిళ పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నాడు.
మరోవైపు బాధిత మహిళ నుంచి 23 కాంటాక్టు లెన్సుల కుప్పను తొలగించిన డాక్టర్ కేథరినా కుర్టీనా ఈ ప్రక్రియకు సంబంధించిన ఫొటోలతో సోషల్ మీడియాలో మరో పోస్ట్ చేశారు. కాంటాక్ట్ లెన్సులన్నింటినీ చాలా జాగ్రత్తగా తీసివేశానని డాక్టర్ కేథరినా చెబుతున్నారు. బాధిత మహిళ కంటి నుంచి తొలగించిన కాంటాక్టు లెన్సులు మొత్తం 23 ఉన్నాయన్నారు. ఇందుకోసం అత్యాధునిక శస్త్రచికిత్స పరికరాలు వాడామని తెలిపారు. కాంటాక్టు లెన్సులు 23 రోజులపాటు కనురెప్పల కిందే ఉండడంతో అవి కనురెప్పలకు అతుక్కుపోయాయని డాక్టర్ వివరించారు.
https://youtube.com/shorts/hX5kizRyEIc?feature=share

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.