కోడలి తప్పు అణువంతయినా లేకపోయినా ఆడపిల్ల పుడితే అష్టకష్టాలు పెట్టే అత్తలున్న లోకంలో ఓ అత్త తన మంచి మనసుతో సమాజంలోని ఆడవాళ్లందరికీ ఆదర్శంగా నిలిచింది. పుట్టే పిల్లలు ఆడామగా అన్నది నిర్ణయం కావడానికి పురుషుడి క్రోమోజోములే కారణమైనా కూడా ఇప్పటికీ అవగాహన రాహిత్యంతో తల్లినే నిందించేవారు సమాజంలో ఎందరో ఉన్నారు. అంతేకాదు, పుట్టబోయేది ఆడపిల్ల అని తెలిస్తే గర్భంలోనే చిదిమేసేవారూ ఉన్నారు. కానీ.. ఈ అత్త మాత్రం తన కోడలికి కూతురు పుట్టినందుకు సంతోషించింది. అంతేకాదు... బ్రహ్మాండమైన కారును బహుమతిగా ఇచ్చింది.
ఉత్తరప్రదేశ్ లోని హమీర్ పూర్ జిల్లాకు చెందిన ప్రేమాదేవి ఆరోగ్య శాఖలో పనిచేసి పదవీ విరమణ పొందారు. ఆమె కోడలు ఖుష్బూ ఇటీవలే ఓ పండంటి పాపాయికి జన్మనిచ్చింది. మగపిల్లల కన్నా ఆడ పిల్లలే ఎంతో మేలని భావించే ప్రేమాదేవి పాపాయి పుట్టినందుకు సంబరపడిపోయారు. తన పేరుకు తగ్గట్లుగానే ప్రవర్తించి తన మనవరాలిపై ఎంతో ప్రేమను కురిపించింది. వెంటనే హోండా సిటీ కారును తన కోడలికి బహూకరిస్తున్నట్లు తెలిపింది. అంతేకాదు, బంధుమిత్రులను ఇంటికి పిలిచి వేడుక జరిపింది.
ఆడపిల్ల పుట్టిందన్న కారణంతో కోడలిని చిత్రహింసలు పెడుతున్న ఘటనలు నిత్యం ఎక్కడో ఒక చోట కనిపిస్తునే ఉన్నాయి. అలాంటివారంతా ప్రేమాదేవిని చూసి నేర్చుకోవాల్సిందే. ప్రేమాదేవిలా అంతా బహుమతులు ఇవ్వలేకపోవచ్చు కానీ... ఆడపిల్ల పుట్టినందుకు కోడలిని నిందించకపోతే అదే పెద్ద బహుమతి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/