సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల మీద తమ నిరసనను వ్యక్తం చేయడానికి వారిపై కొందరు గుడ్లు, చెప్పులు విసరడం....ఓ ఫ్యాషన్ అయిపోయింది. కొందరు....నిరసన వ్యక్తం చేయడం కోసం...మరికొందరు పబ్లిసిటీ కోసం....ఈ తరహా ఘటనలకు పాల్పడుతుంటారు. కొద్దిరోజుల క్రితం....హైదరాబాద్ లోని ఓ నగల దుకాణం ప్రారంభోత్సవానికి వచ్చిన సినీనటి తమన్నాపై ఆమె అభిమాని బూటు విసిరిన ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆమె తెలుగు సినిమాల్లో నటించకపోవడంతో నిరాశచెంది...అలా చేశానని ఆ అభిమాని వివరణ కూడా ఇచ్చాడు. తాజాగా, ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ పై బీజేపీ నేత భార్య ఒకరు గుడ్లు విసిరారు. అయితే, అప్రమత్తమైన భద్రతా సిబ్బంది పట్నాయక్ కు అడ్డుగా నిలవడంతో ఆయనపై గుడ్లు పడలేదు. ఒడిషాలోని బాలాసోర్ లో బీచ్ ఫెస్టివల్ ప్రారంభించడానికి వచ్చిన పట్నాయక్ కు ఈ చేదు అనుభవం ఎదురైంది. ఈ ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఆ ఫెస్టివన్ ను ప్రారంభిస్తున్న పట్నాయక్ పై స్థానిక బీజేపీ నేత భార్య ఒకరు గుడ్లు విసిరారు. తన వెంట బ్యాగ్ లో ఆమె గుడ్లు తెచ్చుకున్నారు. పట్నాయక్ కు సిబ్బంది అడ్డుగా నిలిచి రక్షణనిచ్చారు. పట్నాయక్ పక్కన ఉన్న కొందరు నేతలపై ఆ గుడ్లు పడ్డాయి. ఈ హఠాత్పరిణామంతో అప్రమత్తమైన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనను పట్నాయక్ ఖండించారు. తనపై అక్కసుతోనే బీజేపీ ఇటువంటి నీచమైన చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. 2000 సంవత్సరం నుంచి వరుసగా నాలుగు సార్లు ఒడిషా సీఎంగా పట్నాయక్ ఎన్నికయ్యారు. ఆయన ఆధ్వర్యంలోని బిజూ జనతాదల్ ప్రభుత్వం ఒడిషాలో అధికారంలో ఉంది.
Full View