ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిత్యం నీతులు చెప్పే పార్టీ అధికారంలోకి వచ్చాక.. ఎలాంటి మార్పు ఉండదన్న విషయం తాజాగా వెలుగు చూస్తున్న ఉదంతాలతో ఇట్టే అర్థమయ్యే పరిస్థితి. మిగిలిన రాజకీయ పార్టీలకు ఏమాత్రం భిన్నం కాదన్న విషయం గడిచిన నాలుగేళ్లలో మరింత బాగా అర్థమవుతున్నది. బీజేపీ నేతల మాటలకు చేతలకు మధ్య వ్యత్యాసం తెలిసిపోతోంది.
గతంలో ఎప్పుడూ లేని విధంగా పెద్ద ఎత్తున రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన కమలనాథులు.. తమ వివాదాస్పద వైఖరితో వార్తల్లోకి ఎక్కుతున్నారు. అధికారం చేతిలో ఉన్నప్పుడు ప్రదర్శించే దర్పం.. అహంకారంతో పాటు.. బంధుప్రీతి.. పక్షపాతం లాంటి అవలక్షణాలు కమలనాథుల్లో చాలా ఎక్కువేనన్న మాట ఇప్పుడు అందరినోటా వినిపిస్తోంది.
ఇదిలా ఉంటే.. తాజాగా హర్యానాకు చెందిన రాష్ట్ర మంత్రి ఒకరు మహిళా ఎస్పీ అధికారిణిపై వ్యవహరించిన ధోరణి విమర్శలు వెల్లువెత్తేలా చేస్తోంది. తాను నిర్వహించిన సమావేశానికి జిల్లా ఎస్పీ రాలేదన్న ఆగ్రహంతో ఆమెపై బదిలీ వేటు వేయటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
హర్యానా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి అనిల్ విజ్ ఈ నెల 30న పానిపట్ నగరంలో అధికారులతో ఫిర్యాదుల కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. దీనికి పానిపట్ జిల్లా మహిళా ఎస్పీ సంగీతా కాలియా హాజరు కాలేదు. దీంతో ఆగ్రహించిన అనిల్ విజ్ మహిళా ఐపీఎస్ అధికారిణపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కు కంప్లైంట్ చేశారు.
తాను నిర్వహించిన సమావేశానికి వచ్చి కలవలేదన్న కోపంతో మహిళా ఐపీఎస్ అధికారిణిని బదిలీ చేయించటం ఇప్పుడు సంచలనంగా మారింది. 2015లోనూ సంగీతా కాలియా ఫతేబాద్ జిల్లా ఎస్పీగా పని చేస్తున్న వేళలోనూ.. వైద్య ఆరోగ్య శాఖామంత్రితో జరిగిన సమావేశంలో వాగ్వాదం జరిగింది. ఈ పంచాయితీ మూడేళ్లుగా సా..గుతుండటం.. మంత్రిగారి తీరుపైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.