ఇటీవల కాలంలో సమాజంలోనే కాదు.. వ్యక్తుల్లో అసహనం అంతకంతకూ పెరిగిపోతోంది. చిన్న విషయాలకే పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవటం ఎక్కువైంది. భార్యభర్తల మధ్య కలహాలు చోటు చేసుకోవటం.. దీంతో బలవన్మరణాలకు పాల్పడే తీరు పెరిగిపోతోంది. తాజాగా ఇలాంటి ఉదంతం ఒకటి కుకట్ పల్లిలో జరిగింది.
ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో భార్యభర్తల మధ్య జరిగిన గొడవ ఒక ప్రాణాన్ని బలి తీసుకుంది. తాను చనిపోవటంతో పాటు తన కుమార్తెను సైతం చనిపోయేందుకు ప్లాన్ చేసిన వైనం చూస్తే షాక్ తగలకమానదు. ఎంత కుటుంబ సమస్యలైతే మాత్రం.. మరీ ఇంత ఉన్మాదంగా వ్యవహరించటమా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
సిరిసిల్లకు చెందిన 33 ఏళ్ల పద్మజకు 2006లో రామ్మోహన్ తో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. వీరు కూకట్ పల్లి బాలాజీ నగర్ లో ఉంటున్నారు. రామ్మోహన్ ఈవెంట్స్ చేస్తుండగా.. భార్య అతడు చేసే కార్యక్రమాలకు తోడుగా నిలిచేది. వారికి ఆరేళ్ల ఐశ్వర్య.. రెండేళ్ల అక్షర ఉన్నారు.గడిచిన కొద్దికాలంగా వ్యాపారం సరిగా సాగక.. నష్టాలు పెరిగాయి. దీంతో.. ఇంట్లో గొడవలు మొదలయ్యాయి.
తాజాగా అప్పుల విషయమై భార్యభర్తల మధ్య పెరిగిన మాటలు శ్రుతిమించి గొడవగా మారింది. దీంతో భర్త బెడ్రూంలోకి వెళ్లిపోగా.. పద్మజ మాత్రం తన రెండేళ్ల చిన్నారిని పట్టుకొని బాల్కని నుంచి కిందకు దూకేశారు. నాలుగో అంతస్తు నుంచి చోటు చేసుకున్న ఈ వైనంతో పెద్ద శబ్దంరావటంతో బయటకొచ్చి చూడగా.. భార్య పై నుంచి దూకేసిన వైనాన్ని గుర్తించారు.
పరుగు పరుగున కిందకు వెళ్లిన రామ్మోహన్.. ఆమెను.. కుమార్తెను ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ఆమె మరణించినట్లుగా పేర్కొన్నారు. రెండేళ్ల అక్షర మాత్రం గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. చిన్నారికి ప్రాణాపాయం తప్పింది. ఈ ఉదంతంపై పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. చిన్న విషయాలకే గొడవలు. ఆపై ఆవేశంతో ప్రాణాలు తీసుకోవటం సరికాదన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.