ఘోరం: డెలివరీ అయిన మహిళను రేప్ చేశాడు

Update: 2016-02-16 09:15 GMT
కూతురిపై తండ్రి అత్యాచారం.. రెండేళ్ల పాప రేప్.. ఇలాంటి ఘోరాలు వింటుంటే మన సమాజం ఎటు పోతోందో అర్థం కాని పరిస్థితి. తాజాగా ఎవ్వరూ ఊహించలేని మరో ఘోరం జరిగింది. అప్పుడే బిడ్డకు జన్మనిచ్చిన ఓ బాలింతపై అత్యాచారానికి ఒడిగట్టాడు ఓ దుర్మార్గుడు. అది కూడా ఆమె ఐసీయూలో ఉండగా ఈ ఘోరం జరిగింది. ఢిల్లీలోని గుర్గావ్ లో ఈ దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. శనివారం తెల్లవారుజామున చోటు చేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శనివారం అర్ధరాత్రి గుర్గావ్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఓ మహిళ బిడ్డకు జన్మనిచ్చింది. తర్వాత ఆమెను ఐసీయూకి తరలించారు.

ఐతే డెలివరీ అయిన కొన్ని గంటలకు.. తెల్లవారుజామున 3.30 గంటలకు ఓ వ్యక్తి వెర్నా కారులో వచ్చి ఆసుపత్రి ముందు దిగాడు. అక్కణ్నుంచి అతను నేరుగా ఐసీయూకు వెళ్లాడు. ఆ సమయంలో ఆసుపత్రి సిబ్బంది అంతా నిద్ర పోతుండగా.. అతను వెళ్లి ఆ బాలింతపై అత్యాచారానికి ఒడిగట్టాడు. బాధితురాలు అరవలేని స్థితిలో మత్తులో ఉందని సమాచారం. అత్యాచారానికి పాల్పడ్డాక అతను అక్కడి నుంచి ఉడాయించాడు. బాధితురాలు ఉదయం తన భర్తకు చెప్పాక విషయం బయటికి వచ్చింది. బాధితురాలి భర్త ఢిల్లీ పోలీస్ డిపార్ట్ మెంట్ లో  పని చేస్తుండటం గమనార్హం. నిందితుడు ఎవరన్నది తెలియడం లేదు. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా అతణ్ని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.
Tags:    

Similar News