దాదాపు 40 రోజుల లాక్ డౌన్. అందరి ఉద్యోగ, ఉపాధి పోయి ఇంటికే పరిమితమయ్యారు. ఎవరికి పనిలేక పస్తులుండవద్దని చాలా మంది విరాళాలు పోగు చేసి డబ్బులు, నిత్యావసరాలు అందించారు. చాలా మంది ఈ విరాళాలను స్వయంగా సేకరించి బాధితులకు అందజేశారు.
అయితే వీరి కష్టం ఒక్కరోజుతో నిష్ఫలంగా మారింది. 40 రోజుల లాక్ డౌన్ నిన్నటితో బూడిదలో పోసిన పన్నీరైంది. నిన్న సడలింపులు ప్రకటించడంతో మద్యం షాపులు తెరిచారు. అందరూ మద్యంకోసం ఎగబడ్డారు.ఇక్కడ కరోనా భయం ఎవరిలోనూ కనిపించలేదు. మందు తాగాలన్న తపన తప్ప ఏదీ వినిపించలేదు.
జీతాలు కట్ చేసుకొని మరీ విరాళం ఇచ్చి ఇంటికే పరిమితం అవ్వాలని సేవ చేసిన ఓ మహిళకు తాజాగా కడుపు మండింది. ఏపీలో మద్యం షాపుల వద్ద క్యూలో నిలుచున్న మందుబాబుల వద్దకు వెళ్లి మండిపడింది. 40 రోజుల లాక్డౌన్ కు ప్రతిఫలం ఇదేనా అంటూ మందుబాబులను ప్రశ్నించింది. తాము జీతాలు కట్ చేసుకొని మీకిస్తే మీరు ఇలా తాగుడుకు కట్ చేస్తారా? అని నిలదీసింది.
ఇక పోలీసులను కూడా ఆ సాధారణ మహిళ వదలలేదు. మందు బాబులకు ఎలాగూ బుద్దిలేదని.. పోలీసులు దగ్గరుండి మద్యం కొనుగోలు చేయించడంపై నిలదీసింది. మీరే ఇలా ప్రోత్సహిస్తే ఎలా సమాజం మారిపోతుందని.. 40 రోజుల లాక్ డౌన్ ను ఒక్క పూటలో నాశనం చేశారని ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పుడా వీడియో వైరల్ గా మారింది.
Full View