కొన్ని ప్రేమకథలు చూస్తుంటే...వింటే...ఇలాంటివి నిజమైన ప్రేమకు ఉదాహరణ అని తప్పకుండా అనాల్సిందే. ప్రేమకు పట్టం కట్టేలా..పవిత్రంగా చూసుకున్న తమ భాగస్వామిని గుండెల్లో నింపుకొన్న అలాంటి వ్యక్తులు నిజంగా ఆదర్శప్రాయులు అనే భావన కలుగుతుంది. అలాంటి ఆత్మీయ ప్రేమకు అద్భుతమైన తార్కాణం ఈ సంఘటన. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ ఉదంతం ప్రేమలోకి మరో కోణాన్ని స్పృశిస్తోంది.
బ్రిస్ బేయిన్ జోషువా డేవిస్ - ఐలా క్రాస్ వెల్ లు ప్రేమికులు. వీరిద్దరు దాదాపుగా రెండేళ్లపాటు ప్రేమించుకొని పెళ్లిచేసుకునేందుకు సిద్ధమవుతుండగా..దురదృష్టవశాత్తు...జోషువా డేవిస్ యాక్సిడెంట్ లో మరణించారు. దీంతో ఐలా కుదేలు అయిపోయింది. అయితే..జోషువాతో బిడ్డను కనాలని భావించిన ఐలా...ఆయన వీర్యం ద్వారా బిడ్డను కనాలని నిర్ణయించుకుంది. తన బాయ్ ప్రెండ్ వీర్యాన్ని వాడుకొని తాను గర్భం దాల్చేందుకు అనుమతివ్వాలని కోరుతూ దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఓ బిడ్డకు తండ్రి కావాలన్నది జోషువా కోరిక అని పేర్కొంటూ..తాము గడిపిన సమయాల్లో తరచుగా బిడ్డ గురించే ఎక్కువగా ప్రస్తావించేవాడని..అందుకే ఆయన చివరి కోరిక తీర్చేందుకు అనుమతి ఇవ్వాలని కోరింది.
ఐల ప్రేమ ఉదంతం...కోర్టును ఆశ్రయించడం సోషల్ మీడియాకు చేరింది. దీంతో పలువురు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఐలా కోరుతున్నట్లుగా...ఆమెకు అనుమతి ఇవ్వడమే సరైనదని పలువురు స్పందించారు. ఉదాత్తమైన ప్రేమకు ఉదాహరణగా నిలిచేందుకు ఈ ప్రక్రియ తోడ్పడుతుందని పేర్కొన్నారు. మరికొందరు ఆమె ప్రయత్నాన్ని తప్పుపట్టారు. అయితే సోషల్ మీడియాలో తన వాదనలను వినిపించిన ఐలా ఆకాంక్షను నెగ్గించుకోగలిగింది. రెండు నెలల వాదోపవాదాల అనంతరం కోర్టు అనుమతి ఇచ్చింది.
ఈ ప్రేమకథలో మరో గొప్ప అంశం...ఐలాకు ఇటు ఆమె కుటుంబ సభ్యులతో పాటుగా ఇటు జోషువా సంబంధికులు సైతం పూర్తి మద్దతు తెలిపారు. ఈ పరిణామంపై ఐలా స్పందిస్తూ తమ కలల చిన్నారిని భవిష్యత్ బెంగలేకుండా తన కుటుంబ సభ్యులతో పాటుగా జోయ్ కుటుంబంలోని వారు సైతం ఆదరించడం అనందంగా ఉందన్నారు.