గత ఏడాది నవంబరులో పెద్ద నోట్ల ను రద్దు చేసిన తరువాత ప్రజలు పడిన ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు.. పేదలు నగదు దొరక్క ఇబ్బందిపడితే డబ్బున్నోళ్లు తమ వద్ద పోగయిన నల్లధనం మార్చుకోలేక ఇబ్బంది పడ్డారు. అయితే... కేరళకు చెందిన ఓ ఒంటరి వృద్ధురాలు మాత్రం తాను జీవితకాలంలో సంపాదించిన డబ్బును మార్చుకోలేక... అందుకోసం చివరి శ్వాస వరకు ప్రయత్నించి విఫలమైంది. అసలు నోట్ల రద్దు సంగతే ఆమెకు తెలియక పోవడంతో ఆమె వద్ద ఉన్న పాత నోట్లు రూ.4 లక్షలు వృథా అయ్యాయి. అంతేకాదు.. గుండె - కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆమె చేతిలో డబ్బున్నా అది చెల్లుబాటు కాక అనారోగ్యంతోనే కన్ను మూయాల్సి వచ్చింది.
కేరళలోని ఎర్నాకుళం జిల్లాకు చెందిన 70 ఏళ్ల సతీ భాయ్ ఓ ఒంటరి వృద్ధురాలు. బయట వాతావరణంతో పెద్దగా సంబందం లేకుండా బతుకుతుండేది. జనవరిలో ఇంట్లోకి అవసరమైన వస్తువులు కొనుగోలుచేయడానికి పక్కనే ఉన్న దుకాణానికి వెళ్లిన ఆమెకు, తాను తీసుకెళ్లిన రూ.1000 నోటు చెల్లదని తెలిసి షాకయింది. ఆ నోట్లను రద్దు చేశారని... వాటిని మార్చుకోవాలని అప్పుడే ఆమెకు తెలిసింది. కానీ.. అప్పటికే గడువు ముగియడంతో నోట్లను మార్చుకోవడానికి ఆమె ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఆ పంచాయతీ సభ్యులు కూడా ఆమె పాత నోట్లను మార్చడానికి చాలా శ్రమించారు. సతీ భాయ్‌కి సహకరించడానికి చెన్నై వరకు వెళ్లారు. కానీ నిర్దేశించిన సమయం అయిపోవడంతో, వారికి ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి పర్మిషన్ అవసరం పడింది. పర్మిషన్ రాకపోవడంతో పాత నోట్లు అలాగే మిగిలిపోయాయి.
కాగా.... కేరళ రాష్ట్ర పశువైద్య విభాగం నుంచి సతీ భాయ్ 20 ఏళ్ల క్రితమే రిటైర్ అయింది. అప్పటి నుంచి ఒక్కతే ఒక చిన్న ఇంటిలో నివాసముంటుంది. బయట ప్రపంచంతో ఆమెకు పెద్దగా పరిచయం కూడా లేకపోవడంతో ఇలా నష్టపోయింది. గుండె, కిడ్నీ సంబంధిత వ్యాధులతో ఆమె బాధపడుతుండటంతో కొన్ని వారాల క్రితమే కేర్ హోమ్‌లో చేర్పించారు. చికిత్స పొందుతూ ఆమె గురువారం రాత్రి మరణించింది.
అయితే.. పెద్ద నోట్ల రద్దు సమయంలో సతీభాయ్ ఖాతాలో ఏకంగా రూ.10 లక్షలు డిపాజిట్ అయినట్లు తెలియడంతో అధికారులు అప్పట్లో ఆమె ఇంటిపై రైడ్ చేశారు కూడా. మరి అప్పుడు ఆమె తెలుసుకోలేదా.. లేదంటే ఆమె ఖాతాలో డబ్బు వేసి మార్చాలనుకున్నవారే ఇలా ఆమె ద్వారా రూ.4 లక్షలు మార్పించేందుకు ప్రయత్నాలు చేశారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.