కొన్ని రంగాల్లో ఉన్న వారు తొందరపడకూడదు. ఉత్సాహం పేరుతో అత్యుత్సాహాన్ని అస్సలు ప్రదర్శించకూడదు. ఈ విషయంలో ఏ చిన్న తేడా కొట్టినా పెద్ద ఇబ్బందినే ఎదుర్కొంటారు. తాజాగా అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు ఒక మహిళా కానిస్టేబుల్. సరదా కోసం ఆమె చేసిన ఒక చిట్టి వీడియో వైరల్ గా మారటమే కాదు.. వివాదంలోకి కూరుకుపోయారు. ఇప్పుడు ఆమెపై ఉన్నతాధికారులుచర్యలకు ఆదేశించారు. ఇంతకూ ఆమె చేసిన అంత పెద్ద తప్పేంటి? అన్నది చూస్తే..
ఆగ్రాలోని పోలీస్ స్టేషన్ లో ప్రియాంక మిశ్రా అనే మహిళా కానిస్టేబుల్ సరదాగా చిట్టి వీడియో చేయాలనుకున్నారు. అందుకు తన ఖాకీ డ్రెస్ లో.. తుపాకీని చేతబట్టి.. ఒక డైలాగుకు లిప్ సింక్ చేశారు. దీన్ని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయటం.. అదికాస్తా వైరల్ గామారిపోయింది. ఇంతలా వైరల్ కావటానికి కారణం.. అందులోని కంటెంటే. అందులో ఏముందంటే.. ‘నేరాలకు అడ్డాగా హర్యానా.. పంజాబ్ అనవసరంగా చెడ్డపేరు తెచ్చుకుంటున్నాయి. కానీ.. ఇక్కడకు రండి. ఇక్కడ ఐదేళ్ల పిల్లలకు కూడా పిస్తోలు వాడటం తెలుసు’ అంటూ డైలాగ్ కు లిప్ సింక్ చేశారు.
బాధ్యత కలిగిన పోలీసు ఉద్యోగి అయి.. ఇలాంటివి చేస్తారా? అంటూ ఉన్నతాధికారులు ఆమెపై సీరియస్ అయ్యారు. క్రమశిక్షణకు మారుపేరుగా ఉండాల్సిన పోలీసు ఉద్యోగంలో ఉండి.. నోటికి వచ్చినట్లు మాట్లాడటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఆమెను మందలించారు. అక్కడితో ఆగకుండా పోలీస్ లైన్స్ కు అటాచ్ చేశారు. అది కూడా సరిపోదన్నట్లుగా ఆమె తీరుపై విచారణకు ఆదేశించారు.
ఈ నివేదిక వచ్చే వరకు ఆమెకు డ్యూటీ లేకుండా చేశారు. వీడియో తమ వరకు వచ్చినంతనే చర్యలు తీసుకున్నామని.. నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చర్యలు ఉంటాయని చెప్పారు. ప్రవర్తనా నిబంధనల్ని ఉల్లంఘించటమే కారణంగా పోలీసు ఉన్నతాధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. లేని కష్టాన్ని కొని తెచ్చిపెట్టుకోవటం అంటే ఇదేనేమో?