మద్రాస్ హైకోర్టు ఒక మహిళకు భారీ క్లాస్ పీకింది. విడాకులు కావాలన్న సదరు మహిళకు హితబోధ చేయటంతోపాటు.. ఒక దశలో సీరియస్ అయ్యింది కూడా. విడాకులు అంగట్లో దొరికే వస్తువ కాదని.. విడాకులతో చాలానే విషయాలు ముడిపడి ఉంటాయన్న విషయాన్ని మర్చిపోకూడదని పేర్కొంది.
ఈ ఉదంతంలోకి వెళితే.. తమిళనాడులోని వేలూరు జిల్లాకు చెందిన పవిత్ర అనే మహిళ అదృశ్యమైంది. ఆమెకు పెళ్లి అయి.. పిల్లలు కూడా ఉన్నారు. పవిత్ర అదృశ్యమైన వ్యవహారంలో అంబూరు పోలీసులు షమీల్ అహ్మద్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు.ఈ విచారణలో అతను ప్రాణాలు కోల్పోయాడు. దీంతో.. అంబూరులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
ఈ సందర్భంగా ఒక వర్గం ప్రజలు పోలీస్‌స్టేషన్‌పై దాడి చేశారు కూడా. దీంతోపోలీసులు పవిత్ర ఆచూకీ కనుగొనే విషయంపై దృష్టి సారించి.. ఆమె ఫోన్ సిగ్నల్‌ఆధారంగా అదుపులోకి తీసుకున్న పోలీసులు పవిత్రను మద్రాస్ హైకోర్టు ఎదుట హాజరు పర్చారు.
ఈ సందర్భంగా ఆమె తనకు విడాకులు కావాలని.. తాను మేజర్ అని కోర్టుకు తెలిపారు. దీంతో.. న్యాయమూర్తులు స్పందించి.. ఆమె కారణంగా సమాజంలో కలకలం రేగిందని.. ఒకరు మరణించారని.. ఇష్టానుసారంగా నిర్ణయం తీసుకునే హక్కు ఉన్నంత మాత్రనా పిల్లల బాగోగులు వదిలేసి.. వెళ్లటాన్ని హర్షించరని ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు.. విడాకులు అంగడిలో దొరికే వస్తువ కాదని వ్యాఖ్యానించారు. భర్తను వదిలేసి వెళ్లిన కారణంగా ఒక వ్యక్తి మరణించారని కోర్టు పేర్కొంది. ఆమెను.. ఆమె తల్లిదండ్రులకు అప్పగించాలని అధికారులకు కోర్టు సూచించింది.