పురుషుల రక్షణ కోసం పురుష కమిషన్ ఉండాలనీ - 40 శాతంపైగా స్త్రీలు పురుషులపై హింసకు పాల్పడుతున్నారనే ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి చేసిన వ్యాఖ్యల ఎపిసోడ్ మలుపులు తిరుగుతోంది. ఈ కామెంట్లను పలువురు పురుషులు ఆహ్వానించడమే కాకుండా సోషల్ మీడియాలో సంఘీభావం చెప్తున్న పరిణామాలు ఓ వైపు ఉండగా....మహిళా సంఘాలు ఆమె వ్యాఖలపై మండిపడ్డాయి. వెంటనే ఆ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. నన్నపనేని వ్యాఖ్యలను నిరసిస్తూ హైదరాబాద్ లో మహిళా ఐక్యకార్యాచరణ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగిన సందర్భంగా ఈ డిమాండ్లు తెరమీదకు వచ్చాయి. నన్నపనేని వ్యాఖ్యలు విచారకరమన్నారు. పదవికి రాజీనామా చేసి అలాంటి వ్యాఖ్యలు చేయాల్సి ఉండేదన్నారు. చైర్ పర్సన్ పదవికి ఆమె అనర్హురాలిగా ప్రకటిస్తున్నామని, ఆమె వివరణ లేకుండా ఏపీ ప్రభుత్వం ఆమెను పదవి నుండి దించేయాలని డిమాండ్ చేశారు. ఒకట్రెండు ఘటనలు జరిగినంత మాత్రానా ఆమె రెచ్చిపోయి మాట్లాడాల్సిన అవసరం లేదని అన్నారు. మహిళలకు మహిళలే వ్యతిరేకమని రుజువైందని, తక్షణమే ఆమె రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి మాట్లాడుతూ నన్నపనేని రాజకుమారిని వెంటనే ఆ పదవి నుండి తప్పించాలని ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకపోతే జాతీయ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. స్త్రీల హక్కులు - సమస్యలపై అవగాహన లేనందునే నన్నపనేని అలాంటి వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. మహిళలపై వరకట్న దాడులు - హత్యలు - అత్యాచారాలు పెరుగుతున్నాయని పోలీసు రికార్డులు చెబుతున్నాయని - వీటిపై ఆమె ప్రెస్ మీట్ పెట్టదని ఆరోపించారు. సామాజిక కార్యకర్త దేవి మాట్లాడుతూ రాజ్యాంగబద్దమైన కచ్చితమైన అధికారాలు కలిగి ఉన్న వ్యక్తి మహిళలను కించపర్చేలా మాట్లాడటం దారుణమని వాపోయారు. వెంటనే ఆ పదవికి రాజీనామా చేయాలని లేదా ఏపీ ప్రభుత్వం దించేయాలని డిమాండ్ చేశారు. మహిళా హక్కులు కాపాడాల్సిన వ్యక్తి - మహిళల మనోభావాలు దెబ్బతినేలా..మహిళలకు ప్రతికూల వాతావరణం ఏర్పడేలా మాట్లాడటం అనుచితమైన విషయమని అన్నారు. ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి అలాంటి వ్యాఖ్యలు చేయడం ఆమె అవగాహన రాహిత్యానికి నిదర్శనమన్నారు. అలాంటి వ్యక్తి ఆ పదవిలో ఉండటం సమంజసం కాదని, వెంటనే రాజీనామా చేయాలని లేదా ప్రభుత్వం సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మహిళల హక్కులకు విఘాతం కలిగేలా ఎవరు వ్యాఖ్యలు చేసిన ఆ పదివిలో ఉండటానికి అర్హులు కాదన్నారు.
పీఓడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు సంధ్య మాట్లాడుతూ మహిళలపై దాడులు, హింస, ఉల్లంఘనలు జరుగుతున్నా నన్నపనేనికి పట్టవని విమర్శించారు. పితృస్వామిక భావజాలానికి మాత్రమే తాము వ్యతిరేకమని కానీ, నన్నపనేని మగవారిని ఉరి తీయాలని, చంపాలని అనేక సందర్భా ల్లో వ్యాఖ్యలు చేశారని వాటిని తాము ఖండించామని అన్నారు. ఏపీ మహిళా కమిషన్‌ను కేవలం కౌన్సిలింగ్ కే పరిమితమయ్యేలా చేశారని విమర్శించారు. ఏపీలో నన్నపనేని స్త్రీల సమస్యల కోసం పనిచేసిన దాఖలాలు లేనేలేవన్నారు. పురుషులపై అభిమానం ఉంటే పదవికి రాజీనామా చేసి వారి హక్కుల కోసం పోరాటం చేయాలని హితవు పలికారు. వెంటనే నన్నపనేని తన పదవికి రాజీనామా చేయాలని, ఒక్క రోజు కూడా ఆమె ఆ పదవిలో కొనసాగడానికి వీల్లేదన్నారు. అలాంటి వాళ్ల వల్లే 498 చట్టానికి విలువ లేకుండా పోయిందని విమర్శించారు. స్త్రీ జాతికి క్షమాపణలు చెప్పి పదవికి రాజీనామా చేయాల న్నారు. పీఓడబ్ల్యూ రాష్ట్ర కమిటీ సభ్యు రాలు అనసూయ మాట్లాడుతూ మహి ళలు టీవీలు చూస్తూ చెడిపోతున్నారని, నేరప్రవృత్తి పెరిగి పురుషులపై దాడుల కు పాల్పడుతున్నారని నన్నపనేని మాట్లాడటం హాస్యాస్పదమని వ్యాఖ్యా నించారు. 40శాతం స్త్రీలు నిరక్ష్యరాస్యులుగా ఉన్నారు.