పాస్ పోర్ట్ రూల్ ఛేంజ్ పై మోడీ మాట విన్నారా?

Update: 2017-04-14 05:28 GMT
పాస్ పోర్ట్‌ కు సంబంధించి తాజాగా తీసుకొచ్చిన ఒక‌ కొత్త నిబంధ‌న గురించి చెప్పుకొచ్చారు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ. ఆయ‌న మాటతో మ‌హిళ‌లంతా సంతోషానికి గురి కావ‌ట‌మే కాదు.. భావోద్వేగంగా క‌నెక్ట్ కావ‌టం ఖాయం. పాస్ పోర్ట్ రూల్ కు సంబంధించి ఇప్ప‌టివ‌ర‌కూ పెళ్లి త‌ర్వాత త‌న ఇంటి పేరు మార్చుకోవ‌ట‌మో.. లేదంటే మ్యారేజ్ స‌ర్టిఫికేట్ జ‌త చేయ‌టం లాంటివో చేయాల్సి ఉంది. కానీ.. అలాంటి అవ‌స‌రం లేద‌న్న విష‌యాన్ని చెప్పుకొచ్చారు ప్ర‌ధాని.

రూల్స్ మారాయ‌ని.. పెళ్లి త‌ర్వాత మ‌హిళ‌లు త‌మ పాస్ పోర్ట్ ల్లో త‌మ ఇంటిపేరును మార్చుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని చెప్పారు. జ‌ర్నీ స‌మ‌యాల్లో ప్ర‌యాణ ప‌త్రాలు పొందేందుకు త‌ల్లిదండ్రుల్లో ఎవ‌రో ఒక‌రి పేరును వాడుకోవ‌చ్చ‌న్న ఆయ‌న‌.. పాస్‌ పోర్ట్ పొందేందుకు మ‌హిళ‌లు వివాహ ధ్రువీక‌ర‌ణ.. లేదంటే విడాకుల ప‌త్రాన్ని ఇవ్వాల్సిన అవ‌స‌రం లేద‌ని స్ప‌ష్టం చేశారు.

అభివృద్ధి ప‌థ‌కాలు మ‌హిళ‌లే ల‌క్ష్యంగా సాగుతాయ‌న్న మోడీ.. ఔత్సాహిక మ‌హిళా పారిశ్రామిక‌వేత్త‌ల్నిపొగిడేశారు. ఛాన్స్ ఇస్తే పురుషుల కంటే రెండు అడుగులు మ‌హిళ‌లు ముందు ఉంటార‌న్న ఆయ‌న‌.. ఆ విష‌యాన్ని మ‌హిళ‌లు ఇప్ప‌టికే రుజువు చేశార‌న్నారు. డెయిరీ.. ప‌శు ప‌రిశ్ర‌మ రంగాల్లో మ‌హిళ‌ల వాటానే అధిక‌మ‌న్న ఆయ‌న‌.. మ‌హిళా సాధికార‌త‌కు లిజ్జ‌త్ పాప‌డ్‌.. అమూల్ చ‌క్క‌టి ఉదాహ‌ర‌ణ‌లుగా చెప్పారు. మ‌హిళ‌ల్ని పొగిడేసి.. మ‌హిళ‌ల‌కు స్వీట్ న్యూస్ చెప్పిన ప్ర‌ధాని.. వారి మ‌న‌సుల్ని దోచుకున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News