దేశంలో లాక్‌డౌన్ ప్రకటించిన తరువాత, కంపెనీలన్నీ తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం అవకాశం ఇచ్చిన తరువాత సోషల్ మీడియాలో ఎన్నో సెటైర్లు కనిపించాయి. 21 రోజుల పాటు ఇల్లు కదలకుండా కూర్చుంటే తమ భార్యల టార్చర్‌ని తట్టుకోలేమంటూ చాలామంది ఫన్నీగా సోషల్ మీడియా పోస్టులు పెట్టారు. మీమ్స్, టిక్ టాక్ వీడియోలు ఒకటేమిటి జనం తమ క్రియేటివిటీని తెగ చూపించారు. కానీ.. సోషల్ మీడియాలో క్రియేట్ చేసిన ఫన్‌కి భిన్నంగా ఈ లాక్ డౌన్ సమయంలో మహిళలే కష్టాలు పడుతున్నారట. గృహహింసకు గురవుతున్నారట.
గృహ హింసకు సంబంధించి జాతీయ మహిళా కమిషన్‌కు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నాయి. మార్చి 24 నుంచి లాక్‌డౌన్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్‌సీడబ్ల్యూకి గృహ హింసకు సంబంధించి 58 ఫిర్యాదులు అందాయి. వీటిలో అత్యధికం ఉత్తరాది రాష్ట్రాల నుంచే కావడం గమనార్హం. తమకు అందిన ఫిర్యాదుల్లో ఎక్కువ శాతం పంజాబ్ నుంచే వచ్చినట్టు రేఖాశర్మ పేర్కొన్నారు. ఫిర్యాదులను పరిశీలిస్తున్నట్టు తెలిపారు.
ఇంట్లో ఉంటున్న పురుషులు తమ అసహనాన్ని భార్యలపై చూపిస్తూ హింసకు పాల్పడుతున్నారని నిపుణులు చెబుతున్నారు. లాక్ డౌన్ మరికొన్నాళ్లు కొనసాగితే మానవ సంబంధాల్లో అనేక సమస్యలు వెలుగుచూస్తాయని సైకాలజిస్టులు చెబుతున్నారు. అయితే.. మరికొందరు మాత్రం సరైన అవగాహన లేకుండా గడిపేవారితోనే ఇలాంటి సమస్యలు వస్తాయని.. అత్యధిక కుటుంబాల్లో సంబంధాలు మెరుగుపడతాయని.. భార్యాభర్తలు, పిల్లలు కలిసి గడిపే సమయం పెరిగి సంతోష స్థాయి పెరుగుతుందని విశ్లేషిస్తున్నారు.