అక్టోబరులో ముందుస్తు ఎన్నికలపై ఊహాగానాలు వస్తోన్న నేపథ్యంలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తన నియోజకవర్గంలో మెరుపు పర్యటన ప్రారంభించిన సంగతి తెలిసిందే. హిందూపురంలోని ఎస్సీ ఎస్టీ లు అధికంగా ఉండే గ్రామాల్లో బాలకృష్ణ పల్లె నిద్ర కార్యక్రమాన్ని చేపట్టడమే కాకుండా....ఎస్సీ కాలనీలో సహపంక్తి భోజనం చేసి ఓ ఇంట్లో పల్లె నిద్ర చేశారు. ఇప్పటివరకు నియోజకవర్గంలో పెద్దగా కనిపించని బాలకృష్ణ హఠాత్తుగా పల్లెనిద్ర కార్యక్రమంతో ప్రత్యక్షమవడంతో హిందూపురం ప్రజలు షాకయ్యారు. అయితే, ఇప్పటికైనా తమ ఎమ్మెల్యే నియోజకవర్గం లో పర్యటిస్తుండడంతో తమ సమస్యలు చెప్పుకునేందుకు ప్రజలు ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో తన `హడావిడి` పర్యటనలో బాలకృష్ణకు చేదు అనుభవం ఎదురైంది.
ప్రస్తుతం బాలకృష్ణ చిలమత్తూరు గ్రామంలో పర్యటిస్తున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన ఓ సభలో ప్రసంగిస్తున్న బాలయ్యకు అనూహ్యంగా మహిళల నుంచి నిరసన వ్యక్తమయింది. తమ గ్రామంలో తాగు నీటి సమస్య అధికంగా ఉందని, దానిని పరిష్కరించాలని కోరుతూ మహిళలు ఖాళీ బిందెలతో బాలకృష్ణ ప్రసంగిస్తోన్న సభ ముందు ధర్నా చేశారు. ఈ హఠాత్పరిణామంతో ఖంగుతిన్న బాలకృష్ణ వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయితే, ఈ లోపు వారిని పోలీసులు అడ్డుకున్నారు. బాలకృష్ణతో మాట్లాడేందుకు తమను అనుమతించకపోవడంతో పోలీసులపై కూడా ఆ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు తమ తాగు నీటి సమస్య నివారించేందుకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదని, ఇన్నాళ్లకు తమ నియోజకవర్గ పర్యటనకు వచ్చిన ఎమ్మెల్యేకు తమ సమస్యలు చెప్పుకోనివ్వకుండా పోలీసులు అడ్డుకోవడంపై మహిళలు - స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేశారు.