అక్రమ సంబంధాలు ఎంత డేంజర్ గా ఉంటాయో తెలిపే సంఘటన ఇదీ.. 42 ఏళ్ల ఆంటీతో సంబంధం పెట్టుకున్న పెళ్లికాని 22 ఏళ్ల యువకుడు చివరకు ఆమె చేతిలోనే బలైపోయాడు. పెళ్లికి రెడీ కావడం అతడు చేసిన పెద్ద తప్పు. తనకు దూరమైపోతున్నాడన్న కసితో ఆ ఆంటీ.. రోమాన్స్ కు పిలిచి గొంతు కోసి చంపేసింది.
తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలంలోని మన్ననూరు గ్రామానికి చెందిన 42 ఏళ్ల భర్త వదలిసిన ఒక మహిళతో ఓ 22 ఏళ్ల యువకుడు వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆ మహిళ ఓ ఇల్లు అద్దెకు తీసుకొని కుమార్తెతో కలిసి ఇళ్లలో పనిచేస్తూ జీవిస్తోంది. ఒంటరిగా ఉంటున్న మహిళ అదే కాలనీలో ఉండే యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. భర్త లేకపోవడంతో ప్రియుడిని రోజూ ఇంటికి రప్పించుకొని రాసలీలలు కొనసాగించేది.
ఇటీవలే సదురు యువకుడికి పెద్దలు ఓ యువతితో వివాహం నిశ్చయించారు. ఈనెల 17న పెళ్లికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న మహిళ నన్ను వదిలేసి ఎలా పెళ్లి చేసుకుంటావ్ అని యువకుడిని నిలదీసింది. పెళ్లి చేసుకున్నా నీతో సంబంధం కొనసాగిస్తానని నచ్చ చెప్పాడు. అయినా వినిపించుకోలేదు ఆమె.
తనకు దక్కకుండా పోతున్న ప్రియుడిపై పగతీర్చుకోవాలని మహిళ ప్లాన్ చేసింది. ఈనెల 5న రాత్రి ఎంజాయ్ చేద్దాం రావాలని యువకుడికి ఫోన్ చేసింది. ఆశగా వచ్చిన యువకుడిని శృంగారంలోకి దించి పెళ్లి చేసుకోవద్దని నచ్చచెప్పింది. యువకుడు వినలేదు. మాటామాటా పెరిగి మాంసం కొట్టే కత్తితో యువకుడి గొంతు కోసింది. అతడు అక్కడికక్కడే చనిపోవడంతో చాపలో చుట్టి బ్యాంకు సమీపంలోని మురుగునీటి కాలువలోకి తోసింది.
యువకుడు కనిపించకపోవడంతో అతడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి ఆరాతీయగా.. ఎఫైర్ బయటపడింది. మహిళను విచారించగా తనే చంపానని ఒప్పుకుంది. శవం జాడ తెలిపింది. మృతదేహాన్ని మురికి కాలువ నుంచి బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఆమెపై హత్య కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపారు.