మీకు నచ్చిన నగనను ఎంచుకోండి. ఎస్టిమేట్ స్లిప్ తీసుకోండి. ఆ నగను మొబైల్ లో ఫోటో కూడా తీసుకోండి. రెండింటిని పెట్టుకొని నాలుగైదు షోరూంలలో కంపేర్ చేయండి. ఎక్కడ ధర తక్కువ ఉంటే అక్కడ కొనండి.. డబ్బులు ఈజీగా రావు.. ఇప్పటివరకూ ఎక్కువ డబ్బులు ఇచ్చింది చాలన్న ప్రకటన తెలుగు ప్రజలకు ఎంతగానో సుపరిచితం. తన వ్యాపార సంస్థను ప్రమోట్ చేయటానికి ఒక ఓనర్ రంగంలోకి దిగటం ఒక ఎత్త అయితే.. భారీ ప్రకటనలతో ఎక్కడ చూసినా తన గురించి మాట్లాడేలా చేయటంలో లలితా జ్యూయలరీస్ ఓనర్ సక్సెస్ అయ్యారని చెప్పాలి.
అయితే.. ఆయన మాటల్ని ఇద్దరు మహిళలు మరోలా ఫాలో అయి.. సదరు జ్యూయలరీ సంస్థకే షాకిచ్చారు. యాడ్ లో ఇచ్చిన అవకాశాన్ని తెలివితేటలు ప్రదర్శించి షాకిచ్చారు. హైదరాబాద్ పంజాగుట్టలోని లలితా జ్యూయలరీస్ షోరూంకు ఈ నెల 3న మధ్యాహ్నం రెండు గంటల వేళలో బురఖా వేసుకున్న ఇద్దరు మహిళలు వచ్చారు. రూ.6లక్షల విలువైన నగలను సెలెక్ట్ చేసుకున్నారు. యాడ్ లో చెప్పిన విధంగా ఫోటో తీసుకున్నారు. మాటలతో కళ్లుగప్పి ఆ నగను తమ దుస్తుల్లో దాచేసుకున్నారు. అదే సమయంలో తమ దగ్గర ఉన్న నకిలీ నగను ఒరిజినల్ స్థానంలో పెట్టేశారు.
రెప్పపాటులో జరిగిపోయిన ఈ వైనాన్ని అక్కడి సిబ్బంది గుర్తించలేకపోయారు. తర్వాత చల్లగా తమ దారిన తాము చెక్కేశారు.
అసలు స్థానంలో ఉన్న నకిలీ నగలను తర్వాత గుర్తించిన లలితా జ్యూయలరీస్ సిబ్బంది షాక్ తిన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో.. అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమేరాల ఫుటేజ్ ను పరిశీలిస్తే.. రెండో తేదీన వచ్చిన వారు నగను ఫోటో తీసుకొని.. అలాంటి డూప్లికేట్ నగను తయారు చేసుకొచ్చి మళ్లీ దాని స్థానంలో ఉంచేసి తమ దారిన తాము వెళ్లిపోయారు. కొంగొత్తగా చేసిన ఈ చోరీ సంచలనంగా మారింది. మొత్తానికి చావుతెలివితేటలు ప్రదర్శించిన ఈ ఇద్దరు మహిళల్ని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.