అప్ఘనిస్తాన్ ను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్న తాలిబన్లు తొలిసారి మీడియా ముందుకు వచ్చారు. తాము ఇంటా, బయటా యుద్ధాన్ని కోరుకోవడం లేదని స్పష్టం చేశారు. ఎవరిపైనా కక్ష సాధింపు చర్యలు ఉండవని..అప్ఘన్ గడ్డపై నుంచి ఏ దేశఆనికి ఎటువంటి ముప్పు ఉండబోదని తెలిపారు.
ఇక ఇష్లామిక్ షరియా చట్టాలకు లోబడి మహిళలకు హక్కులు ఉంటాయని.. మహిళలకు విద్య, ఉద్యోగ అవకాశాలు కూడా ఉంటాయన్నారు. తాజాగా తాలిబన్లు భయాన్ని పోగొట్టడానికి ఒక మహిళా రిపోర్టర్ తో ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఆ వీడియోలో మహిళల పట్ల వారి వైఖరి మరోసారి బయటపడింది.
ఆ వీడియోలో మహిళా జరల్నిస్ట్ ఒకరు తాలిబాన్ ఫైటర్స్ తో ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఇందులో భాగంగా తాలిబన్ పాలనలో మహిళా హక్కులను గౌరవిస్తారా? అని లేడీ జర్నలిస్టు ప్రశ్నించారు. దానికి షరియా చట్టాలకు లోబడి వారి హక్కులు ఉంటాయని తాలిబన్లు బదులిచ్చారు.
అనంతరం మహిళా జర్నలిస్టు మరో ప్రశ్న అడిగారు. ‘మహిళా రాజకీయ నేతలకు ఓటు వేసేందుకు అప్ఘన్ ప్రజలను అనుమతిస్తారా? ’ అని అడిగారు. ఈ ప్రశ్నకు తాలిబన్లు నవ్వేశారు. కెమెరా ఆపేయాలంటూ హుకూం జారీ చేశారు.
దీన్ని బట్టి మహిళల పట్ల తాలిబన్లు ఎంత చులకన భావంతో ఉన్నారో అర్థమవుతోంది. మహిళా హక్కులను గౌరవిస్తామని తాలిబన్లు అంటున్నప్పటికీ వారి మాటలపై విశ్వాసం మాత్రం అక్కడి ప్రజలకు కలగడం లేదు.
Full View Full View Full View