మహిళలు అన్నింటా సగం.. వారికి సమాన హక్కులు ఇవ్వాలి.. అన్ని రంగాల్లో ప్రోత్సహించాలి.. అనే మాటలు కాగితాలకే పరిమితం అయ్యాయి. ఎక్కడా ఆచరణ సాధ్యం కాలేదని చెప్పవచ్చు. కనీసం 33 శాతం రిజర్వేషన్ ప్రకారం కూడా లోక్‌సభ ఎన్నికల్లో టికెట్లు ఇవ్వలేదు. దేశవ్యాప్తంగా ఏ పార్టీలో కూడా మహిళలకు న్యాయం జరగలేదని చెప్పవచ్చు. నామ తమిళి యరకట్టి - టీఎంసీ - బీజేడీలో మాత్రమే 33 శాతం మార్కు దాటింది. ఆ మూడు పార్టీల్లోనూ మహిళలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. మిగతా పార్టీల్లో ఒకట్రెండు సీట్లతో సరిపెట్టుకున్నారు. మొత్తం 2019 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారిలో కేవలం 9 శాతం మాత్రమే మహిళలు ఉన్నారు. దేశవ్యాప్తంగా 545 స్థానాలకు గానూ 7,131 మంది పోటీలో ఉండగా.. వారిలో 617 మంది మహిళలు ఉన్నారు.
పార్టీలు - ప్రస్తుతం మహిళా ఎంపీలు
బీజేపీ - 31 మంది
టీఎంసీ - 12
ఏఐడీఎంకే - 04
కాంగ్రెస్ - 04
బీజేడీ - 03
ఇతరులు - 14 మంది గత 2014 ఎన్నికల్లో గెలిచారు.
ప్రస్తుత ఎన్నికల్లో పోటీలో ఉన్న మహిళా అభ్యర్థులు పార్టీల వారీగా..
పార్టీ మొత్తం పురుషులు మహిళలు మహిళల శాతం
నామ తమిళి యరకట్టి 40 20 20 50
టీఎంసీ 41 27 14 34.15
బీజేడీ 21 14 07 33.33
వైఎస్సార్ సీపీ 25 21 04 16
జేడీఎస్ 07 07 01 14.28
ఎస్ పీ 36 31 05 13.89
సీపీఐ–ఎం 54 47 07 12.96
కాంగ్రెస్ 328 286 42 12.8
బీజేపీ 336 294 42 12.5
టీడీపీ 25 22 03 12
టీఆర్ ఎస్ 17 15 02 11.76
డీఎంకే 24 22 02 8.33
పార్టీలు - ప్రస్తుతం మహిళా ఎంపీలు
బీజేపీ - 31 మంది
టీఎంసీ - 12
ఏఐడీఎంకే - 04
కాంగ్రెస్ - 04
బీజేడీ - 03
ఇతరులు - 14 మంది గత 2014 ఎన్నికల్లో గెలిచారు.
ప్రస్తుత ఎన్నికల్లో పోటీలో ఉన్న మహిళా అభ్యర్థులు పార్టీల వారీగా..
పార్టీ మొత్తం పురుషులు మహిళలు మహిళల శాతం
నామ తమిళి యరకట్టి 40 20 20 50
టీఎంసీ 41 27 14 34.15
బీజేడీ 21 14 07 33.33
వైఎస్సార్ సీపీ 25 21 04 16
జేడీఎస్ 07 07 01 14.28
ఎస్ పీ 36 31 05 13.89
సీపీఐ–ఎం 54 47 07 12.96
కాంగ్రెస్ 328 286 42 12.8
బీజేపీ 336 294 42 12.5
టీడీపీ 25 22 03 12
టీఆర్ ఎస్ 17 15 02 11.76
డీఎంకే 24 22 02 8.33