మిస్ యూనివర్స్ పోటీల్లో పెళ్లైన మహిళలు.. షాకింగ్

Update: 2022-08-23 00:30 GMT
మిస్ యూనివర్స్.. అంటే పెళ్లి కాని అందమైన అమ్మాయిలను ఈ విశ్వంలోనే సుందరాంగిగా గుర్తించే పోటీ. అలాంటి పోటీల్లో సాధారణంగా వివాహం కానీ యువతులనే తీసుకుంటారు. కానీ తాజాగా నిర్వాహకులు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు.అందం ఉండాలంటే పెళ్లి కాకముందే కాదని.. పెళ్లైన మగువలకు ఇందులో స్థానం ఇవ్వాలని నిర్ణయించారు.

మిస్ యూనివర్స్ పోటీల నిర్వాహకులు తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. మిస్ యూనివర్స్ పోటీల్లో తల్లులు, వివాహిత మహిళలను అనుమతించడం ద్వారా పోటీకి అర్హతను విస్తరిస్తూ నిర్వాహకులు సంచలన నిర్ణయం తీసుకున్నారు.

2023వ సంవత్సరం నుంచి ప్రారంభమయ్యే మిస్ యూనివర్స్ పోటీల్లో తల్లులు, వివాహితులను కూడా అనుమతిస్తూ చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళల నుంచి సంతోషం వ్యక్తమవుతోంది. ఈ కొత్త నిర్ణయంతో పెళ్లి అయ్యి.. తల్లులైన మహిళలు కూడా అందాల పోటీల్లో తమ సత్తాను చూపించవచ్చని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

పెళ్లి కాని వారినే తీసుకునే సంప్రదాయానికి స్వస్తి చెబుతూ.. వచ్చే ఏడాది నుంచి మిస్ యూనివర్స్ పోటీల్లో తల్లులు, వివాహితులు పాల్గొనేందుకు అనుమతించడం చారిత్రాత్మక మార్పుగా మహిళలు పేర్కొంటున్నారు.

ప్రపంచ అందాల పోటీల్లో 70 ఏళ్లుగా కొనసాగుతున్న విధానాన్ని మార్చడం సంచలనమైంది. గతంలో మిస్ యూనివర్స్ పోటీ నిబంధనల ప్రకారం పోటీదారులు అవివాహితులుగా ఉండాలి. మిస్ యూనివర్స్ పోటీ నిబంధనల ప్రకారం.. విజేతలు అవివాహితులుగా ఉండాలని.. టైటిల్ దక్కించుకున్న తర్వాత  వారి ఏడాది కాలంలోనే అదే హోదాను కొనసాగించాలని ఉండేది. మిస్ యూనివర్స్ గా విజయం సాదించి వారు పనిచేస్తున్న కాలంలో గర్భం దాల్చకుండా ఉండాలన్నది నిబంధన.

కానీ ఇప్పుడు నిబంధనలు మార్చడంపై మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మిస్ యూనివర్స్ 2020 విజేత మెక్సికోకు చెందిన ఆండ్రియా మెజా రూల్ ఈ మార్పును ప్రశంసించారు. మిస్ యూనివర్స్ 2020 కిరీటాన్ని కైవసం చేసుకున్న ఆండ్రియా మెజా నిబంధన మార్పు గురించి తెలుసుకున్న సంతోషం వ్యక్తం చేశారు. సమాజంలో వస్తున్న మార్గదర్శకాలను మెజా విమర్శించారు. అందాల పోటీల్లో పాల్గొనేందుకు వివాహితులకు అనుమతించడాన్ని కొందరు వ్యతిరేకిస్తున్నారని.. అలాంటి వారు స్త్రీ అవావిహితగా చూడాలని పేర్కొంటున్నారు.
Tags:    

Similar News