అమ్మాయిలు జీన్స్ వేసుకుంటే హిజ్రాలు పుడతారు..!

Update: 2020-01-07 01:30 GMT
బిగ్ బాస్ ..బుల్లితెరపై ఎన్నో సంచలనాలు నమోదు చేస్తూ ..టెలికాస్ట్ అయిన ప్రతి భాషలో కూడా వివాదాలకు కేరాఫ్ గా నిలిచి , అందరిని ఆకట్టుకుంటుంది. ఇకపోతే ఈ షో తెలుగు లో ఎన్ని సంచలనాలు సృష్టించిందో అందరికి తెలిసిందే. ఇక ఎన్నో విమర్శలను - ఆటుపోట్లను ఎదుర్కొన్న మలయాళ బిగ్‌ బాస్‌ రియాలిటీ షో సంచలనాలను క్రియేట్‌ చేసింది. తొలి సీజన్‌ విజయవంతం కావడంతో బిగ్‌ బాస్‌ నిర్వాహకులు రెండో సీజన్‌ ను స్టార్ట్ చేసారు. ప్రముఖ నటుడు మోహన్‌ లాల్‌ వ్యాఖ్యాతగా రెండో సీజన్‌ ఆదివారం ఘనంగా ప్రారంభమైంది.

అయితే మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి అప్రతిష్టను మూటగట్టుకున్న రంజిత్‌ కుమార్‌ ను మలయాళ బిగ్‌బాస్‌ యాజమాన్యం సెలక్ట్‌ చేయడంపై పలువురు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆయనెవరు ఎందుకు రంజిత్‌ కుమార్‌ పై వ్యతిరేకత ఉందో ఒకసారి చూద్దాం .... రంజిత్‌ కుమార్‌  గతంలో కాలేజ్ ప్రొఫెసర్‌ గా పని చేసారు. ఆ సమయంలోనే  ఓసారి కళాశాల ప్రాంగణంలో మాట్లాడుతూ... అమ్మాయిలు జీన్స్‌ ధరించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. జీన్స్‌ వేసుకుంటే ట్రాన్స్‌జెండర్‌ లు పుడతారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో అక్కడి విద్యార్థులు నిరసనగా సభా ప్రాంగణం నుంచి వెళ్లిపోయారు.

ఇలా తొలిసారిగా 2013లో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. ఆ తర్వాత రంజిత్‌ కుమార్‌ ఓ టీవీ షోలో అర్థరహిత వ్యాఖ్యలు చేశారు. కొంతమంది తల్లిదండ్రులకు మానసిక సమస్యలతో ఉన్న పిల్లలు జన్మించడానికి  ప్రధాన కారణం పెద్దల డ్రెస్సింగ్‌ సెన్స్‌ అంటూ వ్యాఖ్యానించారు. ఇక మరోసారి రంజిత్‌ మరీ విడ్డూరమైన వ్యాఖ్యలు చేశారు. మహిళలు అస్సలు గెంతకూడదని హితవు పలికారు. పొరపాటుగా అయినా మహిళలు గెంతులు వేస్తే వారి గర్భాశయం ఉన్నచోట నుంచి జారిపోతుందని చెప్పుకొచ్చారు. ఇలా విపరీత వ్యాఖ్యలు చేసే రంజిత్‌ వైఖరిని కేరళ ప్రభుత్వం అప్పట్లో తీవ్రంగా ఖండించింది.

అయితే ఈ వివాదాస్పద వక్త ప్రాంతీయ భాషలో పలు పుస్తకాలను కూడా రచించారు. ఏదైతేనేం.. టీవీ షో కు ప్రాణవాయువు టీఆర్పీ. బిగ్‌ బాస్‌ వంటి కార‍్యక్రమాలకు టీఆర్పీ రావాలంటే వినోదం ఒక్కటే సరిపోదు. వివాదాలు - గొడవలు.. అన్నీ కలగలసి ఉండాలి. అందుకనే బిగ్‌ బాస్‌ యాజమాన్యం రంజిత్‌ కుమార్‌ ను ఏరికోరి తీసుకుందని స్పష్టమవుతోంది. మరి బిగ్‌ బాస్‌ హౌస్‌ లోపలికి వెళ్లాక సంయమనం పాటిస్తాడో లేదా మళ్లీ నోరుజారుతారో చూడాలి!

   

Tags:    

Similar News