మహిళా దినోత్సవం స్పెషల్ .. ఒక్క రోజు హోం మంత్రిగా మహిళా , ఎక్కడంటే ?

Update: 2021-03-08 11:38 GMT
ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా  మధ్యప్రదేశ్ హోం మంత్రి తన బాధ్యతలను ఓ మహిళా కానిస్టేబుల్‌ కు అప్పగించి మహిళలపై తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు. ఒక్క రోజు హోం మంత్రిగా కానిస్టేబుల్ మీనాక్షీ వర్మ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి నరోత్తమ్ మిశ్రా మాట్లాడుతూ.. ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నా బాధ్యతలను మీనాక్షీ వర్మకు అప్పగించాను’ అని చెప్పారు. ఒక్క రోజు హోం మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మీనాక్షీ వర్మ.. సాధారణ ప్రజల సమస్యలను తెలుసుకోనుంది.

ఇదిలా ఉంటే ..  కానిస్టేబుల్ మీనాక్షీ వర్మ హోం మినిస్టర్ నివాస కార్యాలయంలో భద్రతా ఏర్పాట్లు నిర్వహిస్తుంటారు. ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా ఒక్క భారతదేశం మాత్రమే స్త్రీని అమ్మ మాదిరిగా గౌరవిస్తుందని మంత్రి అన్నారు. మరే దేశంలోనైనా చూడండి, అక్కడ మహిళలను అలాంటి గౌరవం లేదా హోదాతో గుర్తిస్తారా, అది పాకిస్థాన్ అయినా, మరే దేశమైనా, భారతదేశంలో మహిళలకు గౌరవం మన సంస్కృతిలో భాగం , ఇదే మనకు ప్రత్యేక గుర్తింపు అని మంత్రి అన్నారు. ఇటీవల ఉత్తరాఖండ్‌కు చెందిన ఓ బాలిక ఒక్క రోజు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. జనవరి 24న జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉత్తరాఖండ్‌ వేసవి రాజధాని గైర్‌ సైన్‌ నుంచి సృష్టి గోస్వామి అనే యువతి సీఎంగా విధులు నిర్వర్తించారు. ప్రభుత్వం చేపట్టిన పథకాల పనితీరును తెలుసున్నారు. హరిద్వార్‌ జిల్లా దౌలతాపూర్ గ్రామానికి చెందిన సృష్టి గోస్వామి రూర్కీలోని బిఎస్‌ ఎమ్‌ పీజీ కాలేజ్‌లో అగ్రికల్చర్‌ బీఎస్సీ చదువుతోంది.
Tags:    

Similar News