జాతివివక్ష తూటాకు బలైన శ్రీనివాస్ కూఛిబొట్ల అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. శోకసంద్రంలో మునిగిన కుటుంబ సభ్యులు.. బంధువులు.. మిత్రులతో పాటు.. మిగిలిన వారంతా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. శ్రీనివాస్ మృతదేహాన్ని చూసి విలపించిన అతడి తల్లిదండ్రుల శోకాన్ని ఆపటం ఎవరితరం కాలేదు. ఇక.. ఆయన సతీమణి సునయిన వేదన అంతాఇంతా కాదు. ఆయన నివాస స్థలమైన హైదరాబాద్ ఇవారులోని బౌరంపేట నుంచి జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానం వరకూ ఆయన అంతిమ యాత్ర సాగింది.
ఈ సందర్భంగా అమెరికాలో జాత్యాంహకారం నశించాలన్న ప్లకార్డులతో పాటు.. ట్రంప్ డౌన్ డౌన్ అన్న నినాదాలు వినిపించాయి. కాగా.. శోకసంద్రంలో మునిగిపోయిన శ్రీనివాస్ తల్లిదండ్రుల్ని.. ఆయన సతీమణిని ఓదార్చటం ఎవరి తరం కాలేదు. తీవ్రఆవేదనలో కుమిలిపోతున్న శ్రీనివాస్ తల్లిదండ్రులు.. తమ చిన్న కొడుకు సాయి కిరణ్ కుటుంబాన్ని అమెరికా నుంచి వచ్చేయమని చెబుతామని.. ఇకపై అతడ్ని అమెరికాకు వెళ్లనీయమని చెప్పారు.
తమ ఇద్దరుపిల్లలు అమెరికాలో స్థిరపడ్డారని సంతోషంగా ఉన్నామని.. ఇంతలోనే ఇంత ఘోరంజరిగిపోయిందంటూ తల్లిదండ్రులిద్దరి రోదనలు చూపురుల కంటనీట పెట్టించాయి. ఏదైనా ఇబ్బంది ఉంటే తిరిగి వచ్చేయాలన్న మాటను తాను చెప్పినప్పుడు.. ఎలాంటి ఇబ్బంది లేదని శ్రీనివాస్ తనతో చెప్పినట్లుగా ఆయన తల్లి గుర్తు చేసుకున్నారు. ఇప్పటికైనా అమెరికాలోని తెలుగువారి భద్రతపై దృష్టి పెట్టాలని.. వారంతా క్షేమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. బరువెక్కిన గుండెతో శ్రీనివాస్ అంతిమ యాత్ర సాగింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/