ప్రస్తుతం లాక్ డౌన్ దేశవ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అన్ని వ్యాపారాలు - దుకాణాలు - అన్ని రంగాలు మూతపడ్డాయి. అయితే కొన్ని రంగాలు మాత్రం కొనసాగుతున్నాయి. అవి కూడా ఇంటి నుంచే. ఇంటి నుంచే ఉద్యోగులతో సేవలు చేయించుకుంటూ కొన్ని కార్యకలాపాలు నడుస్తున్నాయి. ఆయా రంగాల ఉద్యోగులకు కుదిరితే ఇంటి నుంచే పని చేసే అవకాశం ఆయా యాజమాన్యాలతో పాటు ప్రభుత్వం కూడా అవకాశం కల్పించింది. ఈ క్రమంలో సాఫ్ట్ వేర్ తో పాటు పలు రంగాల ఉద్యోగులు - సిబ్బంది ఇంటి నుంచి ఆన్ లైన్ ద్వారా పని చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా వారి సరసన జవాన్లు కూడా చేరిపోయారు. సీఆర్ పీఎఫ్ జవాన్లతో పాటు అధికారులు ఇంటి నుంచి పని చేస్తున్నారు.
సెలవుపై ఇంటికెళ్లి - కరోనా లాక్ డౌన్ కారణంగా తమతమ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన తమ సిబ్బందికి ‘వర్క్ ఫ్రం హోం’ అవకాశాలన్ని సెంట్రల్ రిజర్వ్ ప్రొటెక్షన్ ఫోర్స్ (సీఆర్ పీఎఫ్) ప్రారంభించింది. ఆ చిక్కుకుపోయిన వారంతా తమ తమ ప్రాంతాల్లో కరోనా కట్టడి కోసం.. లాక్ డౌన్ పటిష్టంగా అమలు చేసేందుకు కృషి చేయాలని ఆ అధికారులు తమ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో అలాంటి వారంతా సొంత ప్రాంతాల్లో.. ఇంటి వద్ద విధులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సీఆర్ పీఎఫ్ సిబ్బంది - ఉద్యోగులు - సైనికులు వెంటనే సేవా కార్యక్రమాల్లో మునిగిపోయారు. కొంతమంది తమ సొంత డబ్బుతో అన్నార్తులకు భోజనం అందిస్తున్నారు. పేదలకు చౌకధర సరుకులు అందించేందుకు సహాయం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే కశ్మీర్ లో 49వ బెటాలియన్ లో మానవ్ కలిత తన వివాహం కోసం స్వగ్రామం అసోంలోని బార్పేట జిల్లాకు వెళ్లింది. లాక్ డౌన్ తో అక్కడే చిక్కుకుపోయింది. తాజా అధికారుల ఆదేశం మేరకు లాక్ డౌన్ లోనూ విధులు నిర్వహిస్తున్నాడు. ఈ సందర్భంగా ఉపాధి లేక ఆకలితో అలమటిస్తున్న వారికి ఆయన భోజనం అందిస్తున్నాడు. ఆయనతో పాటు అదే రాష్ట్రంలోని మోరిగావ్ జిల్లాకు చెందిన సీఆర్ పీఎఫ్ అధికారి పద్మేశ్వర్ దాస్ కూడా సేవా కార్యక్రమాల్లో మునిగారు. పేదలకు రేషన్ సరుకులు - నిత్యావసర వస్తువులు అందించారు. అన్నార్తుల ఆకలి తీర్చారు. ఈ సందర్భంగా తమ సిబ్బంది అందిస్తున్న సేవలను గుర్తించి సీఆర్ పీఎఫ్ డైరెక్టర్ జనరల్ ఏపీ మహేశ్వరి అభినందించి ప్రోత్సహించారు. ‘ఆపత్కాలంలో సాయం అందిస్తున్నారు. మీ సేవలకు వందనం’ అంటూ తెలిపారు. సీఆర్ పీఎఫ్ లో మొత్తం సిబ్బంది 3.25 లక్షల మందికి పైగా పని చేస్తున్నారు. వారిలో సాధ్యమైనంత మంది కరోనా కట్టడిలోనూ.. లాక్ డౌన్ విజయవంతంగా అమలు చేయడానికి అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఇంట్లో ఉండి కూడా సైనికులు విధులు నిర్వహించడం వారికే సాధ్యం. అందుకే సైనికా అందుకో సెల్యూట్!