కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మానవ ప్రపంచమంతా ఇంటికే పరిమితమైంది. ఇన్నాళ్లు బాహ్య సమాజంలో బిజీగా ఉన్న ప్రజలంతా ప్రస్తుతం ఇంటికే అంకితమయ్యారు. మహమ్మారి దెబ్బకు భయపడుతూ నివాసాలను వదలడం లేదు. ఈ క్రమంలోనే అనేక కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోం విధానం అమలు చేస్తోంది. అందుకే ఈ లాక్ డౌన్ సమయంలోనూ పెద్ద సంఖ్యలో ఉద్యోగులు ఇళ్లల్లో ఉండి విధులు నిర్వహిస్తున్నారు. సాధారణంగా సాఫ్ట్ వేర్ రంగంలో ఇంటి నుంచే విధులు నిర్వహించడం అనే విధానం ఉంది. అయితే సాధారణ రోజుల్లో ఆ విధానం తక్కువ మంది ఉద్యోగులకు అమలు చేసేవారు. ఇప్పుడు లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఉద్యోగులందరికీ ఇంటి నుంచే పని చేయాలని ఆదేశాలు జారీ చేశాయి. ఆ అవకాశం లేని ఉద్యోగులు మాత్రం ప్రస్తుతం ఖాళీగా ఉన్నారు.
అయితే ఇది ప్రస్తుతం లాక్ డౌన్ వలన ఏర్పడిన పరిస్థితులు. ఇదే విధానం భవిష్యత్ లో ఉండనున్నట్లు పరిణామాలు కనిపిస్తున్నాయి. సాధారణ రోజుల్లో 25 శాతం మంది ఉద్యోగులు ఇంటి నుంచే పని చేసే విధానం అమల్లో ఉండేది. కానీ ఇప్పుడు భవిష్యత్‌లో అది 75 శాతానికి పైగా చేరుకుంటుందని తెలుస్తోంది. ఈ మేరకు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే దశలవారీగా పెంచుతూ 2025లోపు 75శాతం చేయాలనే ఆలోచనలో ఆ కంపెనీ ఉందని సాఫ్ట్ వేర్ రంగంలో వినిపిస్తున్న మాట.
దీని వెనుక పెద్ద ఉద్దేశమే ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో సాఫ్ట్ వేర్ రంగం కూడా తీవ్రంగా దెబ్బతింది. ఈ సమయంలో సాఫ్ట్ వేర్ కంపెనీలు అంతగా ఆసక్తి చూపని వర్క్ ఫ్రమ్ హోం విధానంపై ఇప్పుడు ఫోకస్ పెట్టాయి. భవిష్యత్ లో పరిస్థితులు ఎలా ఉంటాయోనని ఆందోళనతో వర్క్ ఫ్రమ్ హోం విధానం చాలా మేలైన విధానమని భావిస్తున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి తగ్గిన సాధారణ పరిస్థితులు నెలకొన్న కూడా వర్క్ ఫ్రమ్ హోం విధానం అమలుచేయాలనే ఆలోచనలో ఉన్నాయి.