అమరావతికి 30 కోట్ల డాలర్ల రుణాన్ని ప్రపంచ బ్యాంకు వెనక్కు తీసుకోవడంపై ట్రోల్ చేస్తున్న తెలుగుదేశం పార్టీకి ఇది షాకింగ్ వార్త. అదే సమయంలో ఏపీ ప్రజలకు శుభవార్త. ఎందుకంటే తాము ’అమరావతి‘ మౌలిక సదుపాయాలకు రుణం ఇవ్వడానికి మాత్రమే వెనక్కు తగ్గామని - కానీ ఏపీకి లోను ఇవ్వడానికి తాము సుముఖుం గానే ఉన్నట్లు ప్రపంచ బ్యాంకు తెలిపింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ప్రత్యేక ప్రకటన విడుదల చేసింది. పర్యావరణ ఉల్లంఘనలు - భూముల వివాదం వంటి అనేక అంశాల కారణంగా అమరావతి లోను వెనక్కుపోయిందని ముఖ్యమంత్రి కార్యాలయం ఆ ప్రకటనలో తెలిపింది.
గత తెలుగుదేశం ప్రభుత్వం రాజధాని విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం - అక్రమాలకు పాల్పడటం - వరల్డ్ బ్యాంకు లోను రాకముందే టెండర్లు పిలవడం వంటి అనేక తప్పిదాలు చేయడంతో అమరావతి భవిష్యత్తు పై ప్రపంచ బ్యాంకు అనుమానాలు వ్యక్తం చేసిందని - అందుకే ఆ ప్రాజెక్టుకు రుణ మంజూరుపై ఆసక్తి చూపలేదని ముఖ్యమంత్రి కార్యాలయం పేర్కొంది. 2017లో ప్రపంచ బ్యాంకు బృందం అమరావతి పర్యటనలో ఈ ప్రాజెక్టులో పలు అవకతవకలను గమనించిందని ఆ ప్రెస్ నోట్ లో పేర్కొంది. ముఖ్యంగా ల్యాండ్ పూలింగ్ లో అక్రమాలు - సారవంతమైన సాగు భూమిలో ప్రాజెక్టు కట్టడంపై ప్రపంచ బ్యాంకు బృందానికి అనుమానాలు వ్యక్తమయ్యాయి.
ఏదేమైనా లోటులో ఉన్న ఏపీకి ప్రపంచ బ్యాంకు ఆర్థిక సాయం ఎంతో తోడ్పడనుంది. ఇది రోడ్లు - పరిశ్రమలకు సదుపాయాల కల్పన వంటి మౌలిక సదుపాయాల కల్పనకు తోడ్పడనుంది.