అమ‌రావ‌తి కోసం వ‌ర‌ల్డ్‌ బ్యాంకు

Update: 2015-08-30 08:06 GMT
న‌వ్యాంధ్ర రాజ‌ధాని అమ‌రావ‌తిని ప్ర‌పంచ‌స్థాయి రాజ‌ధానిగా నిర్మించేందుకు చంద్ర‌బాబు చేయ‌ని ప్ర‌త‌య్న‌మంటూ లేదు. ఇప్ప‌టికే దేశ‌, విదేశాల‌కు చెందిన ప‌లువురు పారిశ్రామిక‌వేత్త‌ల‌ను నూత‌న రాజ‌ధానిలో భారీ స్థాయిలో పెట్ట‌బ‌డులు పెట్టాల‌ని ఆహ్వానించిన ఆయ‌న రాజ‌ధాని నిర్మాణానికి భారీ స్థాయిలో నిధుల వేట‌కు దిగారు. ఇందులో భాగంగా వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులను ఆశ్రయించారు. కేపిటల్ సిటీ నిర్మాణానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఏపీ సర్కార్‌ ప్రతిపాదనకు ప్రపంచ బ్యాంకు  ప్రాధ‌మికంగా త‌న అంగీకారం తెలిపింది. రాజ‌ధాని నిర్మాణానికి కావాల్సిన పెట్టుబడులు, నిధుల‌పై ఓ స‌మ‌గ్ర నివేదిక త‌యారు చేసి ఇవ్వాల‌ని ప్ర‌పంచ‌బ్యాంకు అధికారులు చంద్ర‌బాబుకు సూచించిన‌ట్టు స‌మాచారం.

రాజ‌ధానిలో సచివాలయం, హైకోర్టు, రాజ్ భవన్‌, ఇత‌ర నిర్మాణాల కోసం కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయనుంది. అయితే వీటితో పాటు ప్ర‌భుత్వ కార్య‌క‌లాపాల‌కు అవ‌స‌ర‌మైన ఇత‌ర భ‌వ‌నాల నిర్మాణానికి కేంద్ర ప్ర‌భుత్వం ఇచ్చే నిధులు స‌రిపోవ‌ని..అందుకు మీ స‌హ‌కారం కావాలంటూ చంద్ర‌బాబు ప్ర‌పంచ‌బ్యాంకును ఆశ్ర‌యించారు. కేపిటల్ సిటీ నిర్మాణానికి సహకరించడంతోపాటు గ్రామీణ నీటిపారుదల వ్యవస్థల బలోపేతానికి సహకరించాలని... మౌలిక వసతులకు సంబంధించి మరో రెండు ప్రాజెక్టులకు నిధులివ్వాలని కూడా చంద్ర‌బాబు వ‌ర‌ల్డ్ బ్యాంకు ప్ర‌తినిధుల‌ను కోరారు.

చంద్ర‌బాబు ప్ర‌తిపాద‌న‌ల‌కు ఓకే చెప్పిన ప్రపంచ‌బ్యాంకు ప్ర‌తినిధులు వీటికి అవ‌స‌ర‌మైన నిధుల కోసం త‌మ‌కు వెంట‌నే ప్ర‌తిపాద‌న‌లు పంపాల‌ని సూచించారు. ఈ మేర‌కు ఏపీ అధికారులు ప్ర‌తిపాద‌న‌లు రెఢీ చేసే ప‌నిలో బిజీ కానున్నారు.
Tags:    

Similar News