స్కూళ్ల మూతతో భారత్ కు భారీ నష్టం!

Update: 2020-10-13 02:30 GMT
కరోనా వైరస్ రక్కసికి ప్రపంచమంతా లాక్ డౌన్ లోకి వెళ్లిపోయింది. సర్వం మూతపడ్డాయి. పాఠశాలలు అయితే గత మార్చి నుంచి తెరవడం లేదు. విద్యార్థుల భవిష్యత్ పై గందరగోళంలో పడిపోయింది. కరోనా ఎప్పుడు తగ్గుతుంది.? పాఠశాలలలు ఎప్పుడు తెరుస్తారో తెలియక అందరిలోనూ అయోమయం నెలకొంది.

కరోనా వైరస్ మొదలైన గత మార్చి నుంచి భారత్ లోని అన్ని పాఠశాలలు మూసివేశారు. ఫలితగా భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ప్రపంచబ్యాంకు అంచనావేసింది.

విద్యాసంస్థల మూసివేతతో సుమారు 400 బిలియన్ డాలర్లకు పైగా నష్టం భారత్ కు రావచ్చని ప్రపంచబ్యాంకు తెలిపింది. పైగా విద్యార్థుల్లో చదవాలన్న లేదా.. నేర్చుకోవాలన్న ఆసక్తి కూడా తగ్గిపోవచ్చు అని ఈ బ్యాంక్ తన నివేదికలో పేర్కొంది.

ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే.. దక్షిణాసియా మొత్తానికి 622 బిలియన్ డాలర్ల నుంచి 880 బిలియన్ డాలర్లకు కూడా చేరవచ్చునని ప్రపంచ బ్యాంక్ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.

‘బీటెన్ ఆర్ బ్రోకెన్.. ఇన్ ఫర్మాలిటీ అండ్ కోవిడ్-19 ఇన్ సౌత్ ఇండియా’ పేరిట ఈ నివేదికను రిలీజ్ చేశారు. ఈ మహమ్మారి విపత్తు కారణంగా సుమారు 50 లక్షలమందికి పైగా విద్యార్థుల డ్రాపవుట్స్ పెరిగాయని.. దీని వల్ల విద్యార్థులు చదువులు దెబ్బతిన్నాయని వారు పేర్కొన్నారు.
Tags:    

Similar News