వరల్డ్ కాంపిటీటివ్ ఇండెక్స్ లో భారత్ ఆరుస్థానాలు మెరుగుపరుచుకొని 43వ స్థానం నుంచి 37వ స్థానానికి ఎగబాకింది. ఇనిస్టిట్యూట్ ఫర్ మేనేజ్ మెంట్ డెవలప్ మెంట్ సంకలనం చేసిన యాన్యువల్ వరల్డ్ కాంపిటీటివ్ ఇండెక్స్ లో భారత్ పుంజుకుంది. ఆసియా ఆర్థిక వ్యవస్థలలో అత్యంత చురుకుగా పెరుగుదలను నమోదు చేసిన దేశాల్లో భారత్ ముందు ఉన్నది.
60 దేశాల జాబితాలో డెన్మార్క్ గత ఏడాది మూడో స్థానంలో ఉండగా.. ఇప్పుడు మొదటి స్థానానికి ఎగబాకింది. స్విట్జర్లాండ్ గత ఏడాది టాప్ ర్యాంకింగ్ నుంచి రెండో స్థానానికి పడిపోయింది. సింగపూర్ ఐదో స్థానం నుంచి మూడోస్థానికి చేరుకుంది.
టాప్ టెన్ దేశాల్లో స్వీడన్ నాలుగో స్థానంలో, హాంగ్ కాంగ్ ఐదో స్థానంలో నెదర్లాండ్ ఆరోస్థానంలో , తైవాన్ ఏడో స్థానంలో ఉంది. ఫిన్ లాండ్ 8వ స్థానంలో, నార్వే 9వ స్థానంలో , అమెరికా 10వస్థానంలో నిలిచాయి.
ఆసియా నుంచి సింగపూర్ మూడో స్థానంలో హాంగ్ కాంగ్ 5వ స్థానంలో తైవాన్ 7వ స్థానంలో , చైనా 17వ స్తానంలో , ఆస్ట్రేలియా 19వ స్థానంలో నిలిచాయి.
ఆర్థిక వ్యవస్థ పనితీరులో ప్రతిఫలాలు భారత్ ర్యాంకు మెరుగు అయ్యేందుకు దోహదం చేసినట్టు ఇనిస్టిట్యూట్ ఫర్ మేనేజ్ మెంట్ డెవలప్ మెంట్ (ఐఎండీ) తెలిపింది.
వ్యాపార సామర్థ్య పారామీటర్లలో కీలకమైన లేబర్ మార్కెట్ 15వ స్థానం నుంచి 6వ స్తానానికి చేరుకుంది. నిర్వహణ పద్ధతులు, వ్యాపార వ్యాల్యూస్ కీలకంగా మారాయని.. ప్రధాని మోడీ ఆధ్వర్యంలో రెట్రో స్వెక్టివ్ పన్నుల్లో మెరుగులు దిద్దడం వ్యాపార రంగంలో నమ్మకాన్ని పునరుద్దరించినట్లు తెలిపింది.