ఒక కొత్త విషయం బయటకు వచ్చింది. కొన్ని లక్షల సంవత్సరాల క్రితం జరిగిన ఒక దారుణ హత్య తాజాగా బయటకు వచ్చింది. అత్యంత కిరాతకమైన ఈ హత్యకు సంబంధించిన ఆధారాల్ని తాజాగా బయటకొచ్చాయి. దీన్ని.. ప్రపంచ మానవ చరిత్రలో మొదటి హత్యగా భావిస్తున్నారు.
స్పెయిన్ లోని ఉత్తర ప్రాంతంలో పురావస్తు ప్రాంతమైన సిమ డిలాస్ హ్యుసాస్ లో తాజాగా ఒక పుర్రెను కనుగొన్నారు. ఈ పుర్రె దాదాపు 4.30లక్షల సంవత్సరాల నాటిదిగా భావిస్తున్నారు. అత్యంత పురాతనమైన ఈ పుర్రెకో ప్రత్యేకత ఉంది. మానవ చరిత్రలో తొలి హత్యగా దీన్ని భావిస్తున్నారు. ఈ తొలి హత్య అత్యంత దారుణంగా జరిగిందని అంచనా వేస్తున్నారు.
ఎంత దారుణంగా ఈ హత్య జరిగిందంటే.. పుర్రె సైతం బద్ధలయ్యేంతలా జరిగి ఉంటుందని చెబుతున్నారు. బలమైన వస్తువును చాలా బలంగా మోదటంతో ఆ వ్యక్తి గిలగిలా కొట్టుకొని మరణించి ఉంటారని చెబుతున్నారు. పుర్రె ముందు భాగం ఎడమవైపున ఒక వస్తువును రెండుసార్లు బలంగా మోదటం ద్వారా ప్రపంచంలో మొదటి హత్య జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పుడు లభ్యమైన ఆధారాల ప్రకారం.. ప్రపంచంలో మొదటి హత్య 4.30లక్షల సంవత్సరాల కిందట జరిగిందన్న మాట.