అంతకంతకూ విస్తరిస్తున్న టెక్నాలజీకి సంబంధించి మనిషి మరో ముందడుగు వేశాడు. ప్రపంచంలోనే తొలిసారి ఒక రోబో సాయంతో చేసిన ఐవీఎఫ్ సక్సెస్ అయ్యింది. అంతేకాదు పండంటి ఇద్దరు ఆడ పిల్లలకు జన్మనిచ్చిన వైనం ఇప్పుడు కొత్త క్రియేషన్ కు దారి తీసిందని చెప్పాలి. స్పెయిన్ లోని బార్సిలో నాకు చెందిన ఒక ఇంజినీర్ల టీం చేసిన ఈ ప్రయోగం విజయవంతమైంది. రోబో ల సాయంతో శుక్రకణాల్ని ప్రవేశ పెట్టిన ఈ ప్రయోగం విజయవంతం కావటంతో రానున్న రోజుల్లో అతి తక్కువ ఖర్చుతో పిల్లల జన్మనిచ్చే వీలు కలిగినట్లు అవుతుందని చెబుతున్నారు.
సామాన్యులకు అందుబాటులో లేని ఐవీఎఫ్ స్థానంలో రోబో ద్వారా చేసే ఐవీఎఫ్ అందుబాటు లోకి వస్తే పిల్లలు లేని జంటలకు తల్లిదండ్రులు అయ్యే వీలు కల్పిస్తుందని చెప్పాలి. ఇంతకీ ఈ ప్రయోగం ఎలా సాగింది? అన్న ప్రశ్నకు సమాధానం తెలుసుకునే ముందు ఈ సంచలన ప్రయోగానికి వేదికగా నిలిచింది న్యూయార్క్ మహానగరంలోని న్యూ హోప్ ఫెర్టిలిటీ సెంటర్.
ఇంతకూ ఈ ప్రయోగం ఎలా సాగింది?
ఆసక్తికర మైన విషయం ఏమంటే ఐవీఎఫ్ పద్దతిలో అత్యంత కీలక మైన ఫెర్టిలిటీ అంశం పై ఏ మాత్రం అనుభవం లేని ఇద్దరు ఇంజనీర్లు ఈ ప్రయోగాన్ని చేపట్టారు. సూది లాంటి సన్నటి రోబోను ఉంచేందుకు వీలుగా సోనీ ప్లే స్టేషన్ 5 కంట్రోలర్ ను ఉపయోగించారు. అందులో శుక్రకణాల్ని నింపారు. కెమేరా ద్వారా మానవ అండాన్ని గుర్తించిన రోబో.. తనంతట తానే చొచ్చుకెళ్లి.. అండంలోకి స్పెర్మ్ ను జారవిడిచింది. రెండు రోజుల వ్యవధిలో అవి ఫలదీకరణం చెందాయన్న విషయాన్ని గుర్తించారు. దీంతో అవి పిండాలుగా మారాయి. తొమ్మిది నెలల అనంతరం ఇద్దరు పండంటి ఆడ పిల్లలు పుట్టిన విషయాన్ని ఎంఐటీ టెక్నాలజీస్ తన రిపోర్టులో పేర్కొంది.
ఖర్చు మాటేమిటి?
ఐవీఎఫ్ పద్దతిలో పిల్లల్ని పుట్టించే విధానం అత్యంత ఖర్చుతో కూడుకున్న పని. అది అందరికి సాధ్యమయ్యేది కాదు. ఖరీ దైన ఈ విధానం కారణంగా డబ్బుల్లేని వారికి ఈ సాంకేతికత అందుబాటులో లేని పరిస్థితి. అయితే.. కొత్తగా రోబోల ద్వారా ఐవీఎఫ్ పద్దతిలో పిల్లల్నిపుట్టించే విధానంలో ఖర్చు అతి తక్కువగా ఉంటుందని చెప్పాలి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న పద్దతితో పోలిస్తే.. కొత్త పద్దతిలో ఖర్చు చాలా చాలా తక్కువగా ఉంటుందని చెబుతున్నారు.
పాత పద్దతికి కొత్తదానికి తేడా ఇదే ప్రస్తుతం అనుసరిస్తున్న విధానంలో అనుభవం ఉన్న వైద్య నిపుణుల పర్యవేక్షణలోనే నిర్వహించాల్సి ఉంటుంది. కానీ కొత్త పద్దతి లో రోబోలు తమ పని తాము చేసుకుంటూ పోతాయి. దీంతో నిపుణులైన వైద్యుల అవసరం తగ్గుతుంది. పాత పద్దతిలో ఎంత ఖర్చు పెట్టినా ప్రయోగం ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది.
కానీ రోబో విధానంలో మాత్రం ఫెయిల్ అనే మాటకు అవకాశమే లేదంటున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న విధానంలో ఐదు లక్షల మంది చిన్నారులు జన్మినిస్తున్నారు. అదే రోబోల సాయంతో అయితే ఈ సంఖ్య మరింత పెరుగుతుందని చెప్పక తప్పదు.